రాజమౌళి జూలై సెంటిమెంట్

Friday,March 15,2019 - 12:29 by Z_CLU

RRR సినిమా జూలై 30 న రిలీజవుతుంది. అంటే సినిమా కంప్లీట్ అవ్వడానికి ఇంకా 16 నెలల టైమ్ పడుతుంది. అంటే రాజమౌళి కంపల్సరీ గా 16 నెలలు కావాల్సిందే అని ‘జూలై’ లో రిలీజ్ అనుకున్నాడా…? లేకపోతే ఇంకేమైనా రీజన్ ఉందా..? అంటే ఈ మధ్య రాజమౌళి సినిమాలన్నీ వరసగా జూలైలోనే రిలీజవ్వడం దృష్టికి వచ్చింది. అందుకే గ్రాండ్ స్కేల్ పై సినిమా అని రూల్ పెట్టుకునే జక్కన్న, జూలై సెంటిమెంట్ ని కూడా అంతే సీరియస్ గా తీసుకుంటున్నాడనిపిస్తుంది.

మగధీర : అంతవరకు ఎన్ని బ్లాక్ బస్టర్స్ వచ్చినా, రాజమౌళి స్థాయి వేరు అని డిక్లేర్ చేసిన సినిమా మగధీర. కథ డిమాండ్ చేసినప్పుడు స్థాయి దాటి బడ్జెట్ పెట్టినా, టాలీవుడ్ లో వసూళ్ళకు ఢోకా ఉండదని నిరూపించిన సినిమా ఇది. జూలై 31, 2009లో రిలీజయింది.

మర్యాద రామన్న : ‘మగధీర’ లో హెవీ హీరోయిజం ఉన్న సినిమా తరవాత కావాలని ఈ రకం కథనెంచుకుని తీశాడు ఈ సినిమాని. ప్రొడక్షన్ వ్యాల్యూస్ దగ్గరి నుండి ప్రతీది రాజమౌళి స్థాయిలోనే ఉన్నా, సినిమాలో హీరోయిజం మాత్రం మచ్చుకు కూడా కనబడకుండా తెరకెక్కింది ‘మర్యాద రామన్న’. 22 జూలై 2010 రిలీజ్ డేట్.

 

 

ఈగ : ఈగతో ఎవరైనా హిట్ కొట్టగలరా …? హిట్ దాకా ఎందుకు… అసలు సినిమా తీయగలరా..? ఇలాంటి ఆలోచనలు రాజమౌళి కే వస్తాయి. ఈ సినిమా కోసం కథ కన్నా ఎక్కువగా ఈగ చుట్టే ఎక్కువ టైమ్ స్పెండ్ చేశాడు. ఈగ బాడీ లాంగ్వేజ్, సౌండ్ సిస్టమ్ అర్థం చేసుకోవడానికి. సినిమాలో ఈగ చేసే సౌండ్స్ కి డబ్బింగ్ కూడా రాజమౌళినే ఇచ్చాడు. సినిమా బ్లాక్ బస్టర్ 6 జూలై 2012 రిలీజ్ డేట్.

బాహుబలి : ఈ సినిమా గురించి ఫిల్మ్ మేకర్ గా రాజమౌళి కి ఎంత తెలుసో ఈ సినిమా చూసిన ఆడియెన్స్ కి కూడా అంతే తెలుసు. టాలీవుడ్ ని ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా. మరీ ప్రభాస్ ని అన్నేళ్ళు  లాక్ చేసేశాడనే ఫీలింగ్ బిగినింగ్ లో ఉన్నా, ఆ వెయిటింగ్ కి తగ్గ ఎక్స్ పీరియన్స్ ‘బాహుబలి’ సినిమా ఇచ్చింది.2015 లో 10 జూలై రిలీజ్ డేట్. ఫస్ట్ పార్ట్ రిలీజయింది కదాని సెకండ్ పార్ట్ రిలీజ్ మంత్ పెద్దగా పట్టించుకోనట్టున్నాడు. అది జూలై కాకుండా 28 ఏప్రియల్ లో రిలీజ్ చేసుకున్నాడు.

RRR : ఇప్పుడు RRR కూడా అంతే…. ఇన్నేసి నెలలున్నా కావాలని మళ్ళీ జూలై నే లాక్ చేసుకున్నాడు. అందుకే రాజమౌళి జూలై సెంటిమెంట్ ని స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నాడనిపిస్తుంది. ఈ ఆలోచన ఎగ్జాక్ట్ గా ఏ సినిమా టైమ్ లో వచ్చిందో చెప్పలేం కానీ, ‘మగధీర’   సినిమా తరవాత చేసిన ప్రతి సినిమా కోసం ఎటు తిరిగి జూలై కే  ఫిక్సవుతున్నాడు. అంతెందుకు టాలీవుడ్ లో రాజమౌళి ఉనికిని  రిజర్వ్ చేసిన సింహాద్రి కూడా జూలై లోనే రిలీజయింది 2003 లో.