అల్లు అర్జున్ హీరోయిన్ ఫిక్సయింది..?

Thursday,February 07,2019 - 02:36 by Z_CLU

ఫాస్ట్ పేజ్ లో ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటుంది అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమా. ఇన్ఫర్మేషన్ పెద్దగా బయటికి రావట్లేదు కానీ, ఆల్మోస్ట్ స్క్రిప్ట్ వర్క్ లాక్ అయినట్టే అనిపిస్తుంది. అయితే ఇదే స్పీడ్ లో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ ని కూడా ఆల్మోస్ట్ లాక్ చేసేశారు మేకర్స్. ఈ సారి రష్మిక మండన్న అల్లు అర్జున్ సరసన నటించే చాన్స్ కొట్టేసింది.

ఈ విషయంలో అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు ఆల్మోస్ట్ రష్మిక ఈ సినిమాకి సంతకం కూడా చేసేసిందన్న టాక్ టాలీవుడ్ లో హీట్ జెనెరేట్ చేస్తుంది. మ్యాగ్జిమం మార్చి లో సినిమాని సెట్స్ పైకి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్న మేకర్స్, త్వరలో ఈ సినిమాకి సంబంధించి ఎగ్జాక్ట్ డీటేల్స్ త్వరలో అనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నారు.

 

జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తరవాత బన్ని, త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా గీతా ఆర్ట్స్, హారిక & హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కనుంది.