రాజమౌళి 'RRR' లో అనుష్క?

Wednesday,March 27,2019 - 11:03 by Z_CLU

RRR సినిమాలో అనుష్క కూడా నటిస్తుందట. ఈ మాట ఎక్కడా అఫీషియల్ గా బయటికి కూడా రాలేదు. అసలు ‘RRR’ కి అనుష్క కి  సంబంధమే లేదు. అంత పెద్ద స్టార్ హీరోయిన్ సినిమాలో నటిస్తున్నప్పుడు ఏ ఫిల్మ్ మేకర్ అయినా ఎందుకు దాచాలనుకుంటాడు..? ఇది ఫ్యాన్స్ లో కొంతమంది పాయింట్ ఆఫ్ వ్యూ… కానీ ఇంకో సెట్ ఆఫ్ RRR ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళలో సినిమాలో అనుష్క కంపల్సరీగా ఉంటుంది అని చెప్పడానికి స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయి.

జస్ట్ గ్లామరస్ రోల్సే కాదు… క్యారెక్టర్ లో దమ్ముండాలి కానీ డీ గ్లామర్ లుక్స్ లో కనిపించడానికైనా, కాస్త వయసు పైబడిన క్యారెక్టర్స్ లో కనిపించాల్సి వచ్చినా ఏ మాత్రం నో చెప్పదు అనుష్క. అందుకే 1920 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో అనుష్క కోసం,  డెఫ్ఫినెట్ గా ఓ క్యారెక్టర్ రాసుకునే ఉంటాడు రాజమౌళి అనే అభిప్రాయం వినిపిస్తుంది. ఏది ఏమైనా RRRలో అనుష్క అంటూ సోషల్ మీడియాలో అప్పుడే మరో రూమర్ స్టార్ట్ అయిపోయింది.

 కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే.. గతంలో ఇలాగే ఆలియా భట్ పేరు వినిపించింది… కొన్నాళ్ళకు కన్ఫమ్ అయింది. అలాగే ఇప్పుడు అనుష్క కూడా కన్ఫమ్ అవుతుందా..? చెప్పలేం. ఇంకొన్నాళ్ళు ఆగితే కానీ ఈ విషయంపై క్లారిటీ రాదు.