NTR హీరోయిన్ - ఎవరీ దైసీ ఎడ్గార్ జోన్స్..?
Saturday,March 16,2019 - 10:03 by Z_CLU
NTR సరసన నటించే అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని వెయిట్ చేయని హీరోయిన్స్ ఎవరు ఉంటారు…? అందునా రాజమౌళి లాంటి సినిమాలో… అందుకే ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుండి ఈ సినిమా హీరోయిన్స్ స్పేస్ లో చాలా మంది టాప్ హీరోయిన్స్ పేర్లు వినిపించాయి. కానీ అందరి ఎక్స్ పెక్టేషన్స్ కి భిన్నంగా హాలీవుడ్ నుండి దైసీ జోన్స్ ఫిక్స్ చేసుకున్నాడు జక్కన్న. అసలు ఎవరీ దేసీ జోన్స్…?
లండన్ లోని ‘ది నేషనల్ యూత్ థియేటర్’ లో థియేటర్ ఆర్ట్స్ చేసిన దైసీ తన 15 వ ఏట నుండే యాక్టింగ్ కరియర్ ని బిగిన్ చేసింది. ఇరవయ్యేళ్ళ ఈ హాలీవుడ్ భామ ఇప్పటికే ‘అవుట్ నంబర్డ్’, ‘సైలెంట్ విట్ నెస్’, ‘కోల్డ్ ఫీట్’, ‘వార్ ఆఫ్ ద వరల్డ్స్’ లో నటించింది. ఎప్పటి నుండి ట్రై చేస్తుందో తెలీదు కానీ, ఏకంగా రాజమౌళి దృష్టిలో పడి, లాంచ్ అయిన క్షణం నుండే హైప్ క్రియేట్ చేసుకుంటున్న RRR లో చాన్స్ కొట్టేసింది దైసీ ఎడ్గార్ జోన్స్.

ఎంత హిస్టరీ హీరోల క్యారెక్టర్స్ తో సినిమా చేసినా , రాజమౌళి కమర్షియల్ ఎలిమెంట్స్ లో ఎక్కడా తగ్గడు. యాక్షన్ రాజమౌళి సినిమాలో కోర్ ఎలిమెంట్ అయితే NTR, చెర్రీ లాంటి హీరోస్ తో పవర్ ఫుల్ డ్యాన్స్ ఎలిమెంట్స్ లేకుండా సినిమా ఉండదు. హాలీవుడ్ హీరోయిన్ హైప్ ఓ వైపు, అంతమందిలో పర్టికులర్ గా ఈ భామనే రాజమౌళి ఎందుకు చూజ్ చేసుకుని ఉంటాడు అనే క్యూరియాసిటీ ఓ వైపు ఈ దైసీఎడ్గార్ జోస్స్ ని మరింత ఫోకస్ లోకి తీసుకువస్తుంది.
ప్రీ ఇండిపెండెన్స్ పీరియడ్ లో నడిచే కథ కాబట్టి డెఫ్ఫినెట్ గా దైసీఎడ్గార్ జోన్స్ రోల్, బిటీష్ రిలేటెడ్ క్యారెక్టర్స్ తో కనెక్ట్ అయి ఉండబోతుందని తెలుస్తుంది. అందుకే పర్టికులర్ గా లండన్ నుండి ఈ భామను సెలెక్ట్ చేసుకున్నాడు రాజమౌళి. మరి ఇంత ప్రెస్టీజియస్ సినిమాతో లాంచ్ అవుతున్నదైసీ, ఇండియన్ సినిమా కాన్వాస్ పై ఏ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసుకోగలుగుతుందో చూడాలి.