అప్పుడే RRR క్లైమాక్స్...?

Friday,November 29,2019 - 10:03 by Z_CLU

RRR క్లైమాక్స్ ఎలా ఉండబోతుంది…? ఇప్పుడిదే ఫ్యాన్స్ లో రేజ్ అయి ఉన్న కొత్త ప్రశ్న. నిన్నా మొన్నటి వరకు NTR హీరోయిన్ చుట్టూ, సినిమాలో విలన్స్ చుట్టూ తిరిగిన స్పెక్యులేషన్స్ ఇప్పుడు ఈ సినిమా క్లైమాక్స్ దగ్గరికి వచ్చి ఆగాయి. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉండబోతుంది…?

హిస్టారికల్ హీరోస్ అల్లూరి సీతారామ రాజు, కొమురం భీమ్… ఇద్దరూ బ్రిటీష్ వారితో పోరాడుతూ చనిపోయిన వాళ్ళే. ఎగ్జాక్ట్ గా బయోపిక్ కాదు కానీ, ఆ క్యారెక్టర్స్ నే ఇన్స్ పిరేషన్ గా తీసుకుని సినిమాని తెరకెక్కిస్తున్న జక్కన్న, ఈ సినిమా క్లైమాక్స్ ని ఎలా ప్లాన్ చేసుకుంటున్నాడు…? రియల్ స్టోరీస్ లో లాగా, ఈ సినిమాలో కూడా చివరికి ఇద్దరూ చనిపోతారా…?

చెప్పలేం… రాజమౌళి వీళ్ళిద్దరి లైఫ్ లోని మరేదైనా ఇంపార్టెంట్ ఎలిమెంట్ ని ఎడాప్ట్ చేసుకుని ఉంటే, డెఫ్ఫినెట్ గా   క్లైమాక్స్ ని డిఫెరెంట్ గా ఎక్స్ పెక్ట్ చేయవచ్చు. కానీ రాజమౌళి ఖచ్చితంగా ఏం చేయబోతున్నాడన్నది ప్రస్తుతానికి సస్పెన్సే…

రీసెంట్ గా రిలీజైన ‘సైరా’ కూడా ఫ్రీడమ్ ఫైటర్ ‘ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి’ రియల్ స్టోరీకి ఇన్స్ పిరేషనే… క్లైమాక్స్ తెలిసిందే. ‘RRR’ కూడా ఆల్మోస్ట్ అలాంటిదే. చూడాలి మరీ.. ఈ సినిమా క్లైమాక్స్ ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నట్టే ఉంటుందా…? లేకపోతే జక్కన్న ఇంకేదైనా కొత్త కథ తెరపై చూపబోతున్నాడా..?