కామెడీ స్టార్ట్ చేసిన సందీప్ కిషన్-హన్సిక

Thursday,February 07,2019 - 04:45 by Z_CLU

సందీప్ కిషన్ కొత్త సినిమా ‘తెనాలి రామకృష్ణ BA.BL’ షూటింగ్ బిగిన్ అయింది. ఈ రోజు కర్నూలులో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఈ షెడ్యూల్ లో సందీప్ కిషన్, హన్సిక కాంబినేషన్ లో ఉండే కీలక సన్నివేశాలను తెరకెక్కి స్తున్నారు.

హిలేరియస్ సినిమాల దర్శకుడు G.నాగేశ్వర రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అవుతుంది. హీరోయిన్ హన్సిక ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ రోల్ ప్లే చేస్తోంది. ఈ సినిమాలో మురళీశర్మ, వరలక్ష్మీ శరత్ కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీ ఇంపార్టెంట్ రోల్స్ లో కనిపించనున్నారు.

శేఖర్ చంద్ర మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాకి శ్యామ్ K. నాయుడు సినిమాటోగ్రాఫర్. అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా శ్రీ నీలకంఠేశ్వర స్వామి క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కనుంది.