రామ్ చరణ్ సినిమాలో ప్రకాష్ రాజ్

Wednesday,May 17,2017 - 11:44 by Z_CLU

సుకుమార్-రామ్ చరణ్ సినిమాకు ఇప్పుడు మరో ఎట్రాక్షన్ యాడ్ అయింది. ఇప్పటికే ఈ సినిమాలో ఓ కీలకపాత్రను రావు రమేష్ పోషిస్తుండగా, మరో కీలకమైన పాత్ర కోసం ప్రకాష్ రాజ్ ను తీసుకున్నారు. జగడం సినిమా తర్వాత మళ్ళీ సుకుమార్ సినిమాలో నటించలేదు ప్రకాష్ రాజ్. ఇన్నాళ్ళకు సుక్కూ దర్శకత్వంలో రాబోతున్న చరణ్ సినిమాలో ప్రకాష్ రాజ్ మెరవనున్నాడు. ప్రకాష్ రాజ్ రాకతో ఈ ప్రాజెక్టు వెయిట్ ఇంకాస్త పెరిగింది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా సాగుతోంది. ఈ షెడ్యూల్ లోనే ప్రకాష్ రాజ్ జాయిన్ అయ్యారు. గత నెలలో రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఒక పాటతో పాటు, సినిమాకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించారు.

సమంతా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. 90ల నాటి పల్లెటూరి ప్రేమకథతో ఈ మూవీ రాబోతోంది. ఇంతకుముందు ప్రకాష్ రాజ్-రామ్ చరణ్ కలిసి గోవిందుడు అందరివాడేలే సినిమాలో నటించారు.