రామ్ చరణ్ సుకుమార్ మూవీ అప్ డేట్స్

Wednesday,May 31,2017 - 06:06 by Z_CLU

రీసెంట్ గా రాజమండ్రి పరిసరాల్లో సక్సెస్ ఫుల్ గా ఫస్ట్ షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకున్న RC 11 టీమ్, సెకండ్ షెడ్యూల్ కి రెడీ అయిపోయింది. లాస్ట్ షెడ్యూల్ లో ఎండ వల్ల ఇబ్బంది పడటంతో కాస్త గ్యాప్ తీసుకుని మరీ, సెకండ్ షెడ్యూల్ కి రెడీ అయిన సినిమా యూనిట్, రేపటి నుంచి మళ్ళీ సెట్స్ పైకి రానుంది.

ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సాంగ్ ని ప్లాన్ చేస్తున్న సినిమా యూనిట్, గోదావరి ఒడ్డున భారీ సెట్స్ వేసి షూటింగ్ జరపనుంది. దీంతో పాటు హైదరాబాద్ లో కూడా మరో సెట్ వేసి, రెగ్యులర్ షూటింగ్ కి ప్లాన్ చేస్తుంది సినిమా యూనిట్. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ ఆల్ రెడీ కంప్లీట్ చేసేసుకుంది ఆర్ట్ డిపార్ట్ మెంట్.

సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జగపతి బాబు, ప్రకాష్ రాజ్, ఆది కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. త్వరలోనే ఈ సినిమాకు ఓ పేరు పెట్టబోతున్నారు.