హీరోగా పదేళ్ళు

Wednesday,May 17,2017 - 12:35 by Z_CLU

మినిమం సక్సెస్ గ్యారంటీ, పక్కా డిఫెరెంట్ సినిమాల హీరో.. ఇవీ నిఖిల్ గురించి ఎవరైనా మాట్లాడితే ఇచ్చే కాంప్లిమెంట్స్. ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండానే హ్యాపీడేస్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ కి ఇంట్రడ్యూస్ అయిన నిఖిల్ సిద్ధార్థ, టాలీవుడ్ కి పరిచయమై పదేళ్ళు అయింది.

క్యారెక్టర్ ఎలాంటిదైనా ఇమిడిపోయే లక్షణాలున్న నిఖిల్, విలక్షణమైన సినిమాలను ఎంచుకుంటూ కరియర్ ని ప్లాన్ చేసుకుంటున్నాడు. ‘స్వామిరారా’ సక్సెస్ నిఖిల్ కరియర్ కి బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అయితే, చందూ మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కిన ‘కార్తికేయ’ నిఖిల్ ని కమర్షియల్ హీరో రేంజ్ కి తీసుకువెళ్ళింది. ఆ తరవాత ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని బ్యాగ్ లో వేసుకున్న నిఖిల్ ఇప్పుడు ‘కేశవ’ సినిమాతో సరికొత్తగా ఎంటర్ టైన్ చేయబోతున్నాడు.

ఈ పదేళ్లలో మినిమం గ్యారెంటీ హీరో అనిపించుకున్నాడు నిఖిల్. ఎంతోమంది దర్శకులు, నిర్మాతలు నిఖిల్ తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. కేశవ సినిమా తర్వాత.. మరో డిఫరెంట్ సినిమాలతో పాటు ఇంకో రెండు రీమేక్స్ తో అలరించబోతున్నాడు ఈ కుర్రహీరో. పరిశ్రమకొచ్చి పదేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా నిఖిల్ కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు అందిస్తోంది జీ సినిమాలు.