రామ్ చరణ్ సుకుమార్ మూవీ అప్ డేట్స్

Wednesday,May 03,2017 - 03:30 by Z_CLU

రీసెంట్ గా రాజమండ్రిలో సక్సెస్ ఫుల్ గా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న చెర్రీ – సుకుమార్ సినిమా యూనిట్ ప్రస్తుతం బ్రేక్ మోడ్ లో ఉంది. 80’s బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంతా హీరోయిన్ గా నటిస్తుంది. అల్టిమేట్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంతా హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

ఫస్ట్ షెడ్యూల్ సక్సెస్ ఫుల్ గా ప్లాన్ చేసుకున్న సినిమా యూనిట్ , ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ని ప్లాన్ చేసుకుంటుంది. మే 9 నుండి రెగ్యులర్ షూటింగ్ కి స్కెచ్ వేస్తున్న సినిమా యూనిట్, ఈ షెడ్యూల్ లో సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాలను తెరకెక్కించే ఆలోచనలో ఉంది. రోజు రోజుకి హై ఎండ్ క్యూరాసిటీని జెనరేట్ చేస్తున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.