రామ్ చరణ్ – సుకుమార్ మూవీ అప్ డేట్స్

Monday,March 20,2017 - 08:07 by Z_CLU

రామ్ చరణ్ మేకోవర్ పూర్తయింది. సుకుమార్ సినిమా కోసం భారీగా గడ్డం పెంచాడు చరణ్. ఓ సినిమా కోసం చరణ్ ఈ స్థాయిలో గడ్డాలు, మీసాలు పెంచడం ఇదే ఫస్ట్ టైం. మేకోవర్ పూర్తవ్వడంతో సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతోంది యూనిట్. పశ్చిమగోదావరి జిల్లాలోని కొన్ని అందమైన లొకేషన్లలో త్వరలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది.

చెర్రీ-సుకుమార్ సినిమా కోసం ఏకంగా భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు. సింగిల్ షెడ్యూల్ లో ఏకథాటిగా షూటింగ్ కొనసాగించేలా… ఏకంగా 35 రోజుల లాంగ్ షెడ్యూల్ ను ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లోనే సినిమాకు సంబంధించిన కీలకమైన సన్నివేశాల్ని పూర్తిచేయాలని సుకుమార్, చరణ్ భావిస్తున్నారు.

సమంతా ఫస్ట్ టైం చెర్రీ తో స్క్రీన్ షేర్ చేసుకోనున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఇప్పటికే కొన్ని ట్యూన్స్ ఫైనలైజ్ అయిపోయిన ఈ సినిమాని దసరా కల్లా రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు ఫిలిం మేకర్స్.