పవన్ కల్యాణ్ ట్విట్టర్ ఎకౌంట్ హ్యాక్

Wednesday,May 17,2017 - 10:54 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ట్విట్టర్ ఎకౌంట్ ను ఎవరో హ్యాక్ చేశారు. ఈ విషయాన్ని పవన్ సన్నిహితులు అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఎకౌంట్ ను రీస్టోర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నామని, నిపుణుల పర్యవేక్షణలో ఈ పనులు సాగుతున్నాయని ప్రకటించారు.

సినిమాలు లేదా రాజకీయాలకు సంబంధించిన ఏ విషయంపై అయినా ట్విట్టర్ పైనే రియాక్ట్ అవుతారు పవన్. పవర్ స్టార్ కు సంబంధించిన ఏ అధికారిక సమాచారం కోసమైనా ఎవరైనా ట్విట్టర్ నే ఓపెన్ చేస్తారు. అలాంటి కీలకమైన ట్విట్టర్ ఎకౌంట్ ఇప్పుడు హ్యాక్ అయింది.