విశాఖలో ‘రంగస్థలం’ ప్రీ రిలీజ్ ఈవెంట్

Tuesday,February 20,2018 - 02:23 by Z_CLU

రంగస్థలం ప్రమోషన్ ఊపందుకుంది. ఇప్పటికే ఓ సింగిల్ రిలీజ్ చేశారు. త్వరలోనే టైటిల్ సాంగ్ కూడా రాబోతోంది. తాజాగా ఇప్పుడు ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కూడా ఫిక్స్ అయింది. రిలీజ్ కు కొన్ని రోజుల ముందు, ఉగాది రోజున విశాఖ సాగర తీరంలో ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకను గ్రాండ్ గా నిర్వహించాలని ఫిక్స్ అయ్యారు.

రంగస్థలం సినిమాకు సంబంధించి సెకెండ్ సింగిల్ రిలీజ్ లో భాగంగా టైటిల్ సాంగ్ ను విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించిన డేట్ ను త్వరలోనే ఎనౌన్స్ చేస్తారు. ఇలా దశలవారీగా సాంగ్స్ రిలీజ్ చేసిన తర్వాత హైదరాబాద్ లో ఓ ప్రమోషనల్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఆ తర్వాత డైరక్టర్ గా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు వెళ్లిపోతారు. ఇది రంగస్థలం ప్రచార వ్యూహం.

చరణ్, సమంత హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను సుకుమార్ డైరక్ట్ చేస్తున్నాడు. 1985 కాలం నాటి విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కుతోంది.