నా ‘తొలిప్రేమ’ తరవాత నేను చూసిన సినిమా ఇది – పవన్ కళ్యాణ్

Saturday,April 14,2018 - 11:03 by Z_CLU

నిన్న హైదరాబాద్ లో ‘రంగస్థలం’ సక్సెస్  మీట్   ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ లో ‘రంగస్థలం’ టీమ్ తో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా రావడంతో ఈ సెలెబ్రేషన్స్ మరింత ప్రత్యేకం అనిపించుకున్నాయి. ఇంత బిజీ షెడ్యూల్స్ లోను చెర్రీ కోసం, ఈ సెలెబ్రేషన్స్ లో టైమ్ స్పెండ్ చేసిన పవన్ కళ్యాణ్, చెర్రీ గురించే కాదు రంగస్థలం గురించి కూడా చాలా విషయాలు మాట్లాడాడు.

‘సాధారణంగా నేను నా సినిమాలు కూడా చూడను. ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం నేను నటించిన ‘తొలిప్రేమ’ చూశాను. మళ్ళీ ఇప్పుడు ఈ ‘రంగస్థలం’ చూశాను. ఈ సినిమాకి నాలుగు వైపుల నుండి వస్తున్న ప్రశంసలు చూసి ఆగలేక ఈ సినిమా చూశాను. సినిమాని అద్భుతంగా తెరకెక్కించాడు సుకుమార్. చెర్రీ ఈ సినిమాలో చాలా న్యాచురల్ గా పర్ఫామ్ చేశాడు. ఆస్కార్ రేంజ్ సినిమా రంగస్థలం ఇందులో అనుమానమే లేదు’  అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పుకున్నాడు పవన్ కళ్యాణ్.

 

సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా అటు క్లాస్, ఇటు మాస్ అని తేడా లేకుండా అన్ని క్యాటగిరీస్ ని ఇంప్రెస్ చేస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాలో రామ చరణ్ సరసన సమంతా హీరోయిన్ గా నటించింది.