ఒక హీరో సినిమాకు మరో హీరో ప్రచారం

Wednesday,May 23,2018 - 10:01 by Z_CLU

టాలీవుడ్ లో ఇది సరికొత్త ట్రెండ్. టాలీవుడ్ లో ఒక స్టార్ హీరో సినిమాని మరో స్టార్ ప్రమోట్ చేయడం ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. మహేష్ బాబు సినిమాను ఎన్టీఆర్ ప్రమోట్ చేస్తాడు. రవితేజ సినిమాకు పవన్ ప్రచారం కల్పిస్తాడు. ఇలా హీరోలంతా మరో హీరోకు ఫుల్ సపోర్ట్ ఇస్తూ సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు.

రంగస్థలం

సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘రంగస్థలం’ భారీ విజయాన్ని అందుకుంది. థాంక్స్ మీట్ కి పవన్ కళ్యాణ్ అటెండ్ అవ్వడంతో ఈ సినిమాకి మరింత హైప్ పెరిగింది. సినిమా రిలీజయి 50 రోజులు దాటినా, ఈ సినిమా ఇంకా సక్సెస్ ఫుల్ గా ప్రదర్శించబడుతుంది.

 

భరత్ అనే నేను

ఈ సినిమా ప్రీ రిలీజ్ కి అటెండ్ అయ్యాడు యంగ్ టైగర్ NTR. ఈ సినిమా దర్శకుడు కొరటాల డైరెక్షన్ లో తెరకెక్కిన జనత గ్యారేజ్ లో నటించిన NTR, ‘భరత్ అనే నేను’ కూడా అదే రేంజ్ లో సక్సెస్ అవుతుందని కాన్ఫిడెంట్ గా చెప్పడం టాలీవుడ్ లో సినిమా పట్ల భారీ హైప్ ని క్రియేట్ చేసింది.

నా పేరు సూర్య

రిలీజ్ కి ముందే భారీ ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ చేసుకున్న ‘నా పేరు సూర్య’  సినిమాని రామ్ చరణ్ ప్రమోట్ చేయడం, సినిమాకి పెద్ద ప్లస్ అయింది. అల్లు అర్జున్ కరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ‘థాంక్స్ ఇండియా మీట్’ కి పవన్ కళ్యాన్ అటెండ్ అవ్వడం విశేషం.

 

 

నేలటికెట్

ఈ నెల 25 న రిలీజవుతుంది రవితేజ ‘నేలటికెట్’. అయితే రీసెంట్ గా ఆడియో రిలీజ్ జరుపుకున్న ఈ సినిమాకి  పవన్ కళ్యాణ్  చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యాడు. ఈ ఈవెంట్ లో రవితేజ కి, తనకు మధ్య ఉన్న బాండింగ్ ని షేర్ చేసుకున్న పవన్ కళ్యాన్, ‘నేల టికెట్’ సినిమాని మరింత లైమ్ లైట్ లోకి తీసుకు వచ్చాడు.

 

 

మహానటి

సీనియర్ నటి సావిత్రి బయోపిక్ గా తెరకెక్కిన మహానటి ఆడియో రిలీజ్ ఈవెంట్ లో NTR తో పాటు నాగార్జున కూడా అటెండ్ అవ్వడం విశేషం. ఈ సినిమా చుట్టూ బిగినింగ్ నుండే పాజిటివ్ వైబ్స్ ఉన్నా, ఈ ఇద్దరి ప్రెజెన్స్ సినిమా సక్సెస్ పై భారీ ఇంపాక్ట్ చూపిందనే చెప్పాలి…

 

సమ్మోహనం

రీసెంట్ గా ఈ సినిమా టీజర్ రిలీజయింది. అయితే ఈ టీజర్ చూసి ఇంప్రెస్ అయిన మెగాస్టార్ ఈ సినిమా హీరో సుధీర్ బాబు తో చిట్ చాట్ చేయడం విశేషం. దాంతో ఈ సినిమా టీజర్ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ స్పేస్ క్రియేట్ చేసుకుంది. జూన్ 15 న రిలీజవుతున్న ఈ సినిమాపై ఈ మెగా ఇంపాక్ట్ గ్యారంటీగా ఉంటుందనే అనిపిస్తుంది.