బాలీవుడ్ సినిమాలో చాన్స్ కొట్టేసిన రెజీనా

Tuesday,February 20,2018 - 03:26 by Z_CLU

బాలీవుడ్ సినిమాలో నటించనుంది రెజీనా. ఇప్పటికే సౌత్ సినిమాల్లో తనకంటూ పర్టికులర్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న రెజీనా, ఇప్పుడు బాలీవుడ్ లోను అదే క్రేజ్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతుంది. సోనమ్ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ‘ఏక్ లడ్కీకో దేఖాతో ఐసా లగా’ సినిమాలో క్రూషల్ రోల్ ప్లే చేయనుంది రెజీనా.

షెల్లీ చోప్రా డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో జూహీ చావ్లా, అనిల్ కపూర్, రాజ్ కుమార్ రావ్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. విదు వినోద్ చోప్రా ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.

రీసెంట్ గా అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్, ఇలియానా లాంటి స్టార్స్ తో బిగిన్ కానున్న ‘ఆంఖే’ అనే సినిమాకి సంతకం చేసినా, ఆ సినిమా సెట్స్ పైకి రాలేదు. లక్కీగా ఈ సినిమా కోసం ఫిల్మ్ మేకర్స్ అప్రోచ్ అవ్వడంతో, ఈ సినిమాతో బాలీవుడ్ ని ఎట్రాక్ట్ చేయడానికి రెడీ అవుతుంది రెజీనా.