ఇది ఆడియెన్స్ ఇచ్చిన అవార్డు – రామ్ చరణ్

Wednesday,January 09,2019 - 10:03 by Z_CLU

రీసెంట్ గా బెస్ట్ లీడింగ్ యాక్టర్ గా ప్రెస్టీజియస్ ‘జీ సినీ అవార్డు’ అందుకున్నాడు రామ్ చరణ్. 1980 బ్యాక్ డ్రాప్ లో, చెవులు సరిగ్గా వినపడని వ్యక్తిగా అతి న్యాచురల్ పర్ఫామెన్స్ కి ఆడియెన్స్ ఫిదా అయిపోయారు. అందుకే చెర్రీ బెస్ట్ లీడింగ్ యాక్టర్ గా ఫస్ట్ ప్లేస్ లో నిలిచాడు. ఈ సందర్భంగా తన హ్యాప్పీనెస్ ని వ్యక్తం చేశాడు రామ్ చరణ్.

‘ఇది నాకొచ్చిన అవార్డు అనేకన్నా, ఆడియెన్స్ ఇచ్చిన అవార్డు’ అనుకుంటున్నా. ‘ప్రతి సినిమా అద్భుతమనిపించుకోవాలి అని చేయం. కానీ కష్టపడే విషయంలో మాత్రం, ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వం. మేం పడ్డ కష్టం ఆడియెన్స్ గుర్తిస్తే, అంతకన్నా ఇంకా ఏం కావాలి అనిపిస్తుంది. ‘బెస్ట్ లీడింగ్ యాక్టర్’ గా ఆడియెన్స్ నన్ను ఎంచుకోవడం, ఇంత ప్రెస్టీజియస్ ‘జీ సినీ అవార్డు’ అందుకోగలగడం చాలా సంతోషంగా ఉంద’ని చెప్పుకున్నాడు మెగా పవర్ స్టార్.

రామ్ చరణ్ కరియర్ లోనే స్పెషల్ గా నిలిచింది రంగస్థలం. మాస్ హీరోగా పవర్ ఫుల్ డైలాగ్స్ కి, ఎనర్జిటిక్ డ్యాన్స్ నంబర్స్ కి బ్రాండ్ అంబాసిడర్ లాంటి చెర్రీ, ‘రంగస్థలం’ లాంటి సినిమా చేయడం నిజంగా సాహసమే. ఈ సినిమా సక్సెస్ టాలీవుడ్ లో గొప్ప రివొల్యూషన్ తీసుకొచ్చింది.