చిరు.. చెర్రీ ఒకేసారి ఇలా...

Saturday,September 07,2019 - 01:02 by Z_CLU

ప్లానింగ్ అయ్యే చాన్సెస్ లేవు కానీ… అటు చిరు ఇటు చెర్రీ ఇద్దరూ ఒకేసారి సెట్స్ పై హిస్టరీలో ట్రావెల్ చేస్తున్నారు. అందునా రియల్ హీరోస్ గా.. స్ట్రేట్ గా చెప్పాలంటే మెగాస్టార్ ఫ్రీడమ్ ఫైటర్ ఉయ్యాలవాడ నరసింహా రెడ్డిగా… ఇటు రామ్ చరణ్ RRR లో అల్లూరి సీతారామ రాజుగా నటిస్తున్నారు.

ఓ రకంగా చెప్పాలంటే ఇద్దరూ చేసేవి రెగ్యులర్ గా రిలీజయ్యే మాస్ మసాలా సినిమాలు కావు.. బడ్జెట్ పరంగా చూసుకున్నా, కంటెంట్ పరంగా చూసుకున్నా… రెండూ ప్రెస్టీజియస్ సినిమాలే… లెజెండ్రీ పాత్రలే…

నిజానికి ఇద్దరూ ఒకేసారి ఈ సినిమాలతో సెట్స్ పై ఉన్నా.. ‘సైరా’ రిలీజయ్యాకే RRR రిలీజవుతుంది కాబట్టి పెద్దగా కంపారిజన్స్ ఉండవు కానీ, కానీ లుక్స్ విషయంలో మాత్రం ఈ ఆన్ స్క్రీన్ మెగా ఫ్రీడమ్ ఫైటర్స్ ని డెఫ్ఫినెట్ గా కంపేర్ చేసుకుంటారు మెగా ఫ్యాన్స్.

మెగాస్టార్ లుక్స్ ఇప్పటికే రివీల్ అయిపోయాయి. ట్రైలర్ లో కూడా యంగ్ హీరోస్ కి ఏ మాత్రం తీసిపోలేదు అనిపించుకున్నాడు. సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి. ఇక చెర్రీ విషయానికి వస్తే రాజమౌళి హీరో అక్కడ… కాబట్టి తగ్గే చాన్సెస్ అస్సలు లేవు… అందుకే ఫ్యాన్స్ లో ఈ 2 సినిమాలపై ఏ స్థాయిలో క్రేజ్ ఉందో… ఈ ఇద్దరి లెజెండ్రీ పర్ఫామెన్స్ పై కూడా అంతే క్యూరియాసిటీ ఉంది.