అరకులో RRR

Tuesday,December 10,2019 - 12:06 by Z_CLU

రేపటి నుండి NTR కాంబినేషన్ లో సినిమాలోని కీ సీన్స్ ని తెరకెక్కించే ప్రాసెస్ లో ఉంది RRR టీమ్. ఫారెస్ట్ ఏరియాలో జరిగే ఈ సన్నివేశాల్ని అరకులో తెరకెక్కించబోతున్నాడు రాజమౌళి. రేపట్నుంచి నుండి బిగిన్ కానున్న ఈ షెడ్యూల్ తరవాత, పాటల చిత్రీకరణపై ఫోకస్ పెట్టనున్నారు మేకర్స్.

రీసెంట్ గా ఈ సినిమాలోని విలన్స్ తో పాటు NTR హీరోయిన్ ఒలీవియా మారిస్ డీటేల్స్ రివీల్ చేసిన మేకర్స్, త్వరలో ఈ సినిమా అఫీషియల్ టైటిల్ ని రివీల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ‘RRR’ ని వర్కింగ్ టైటిల్ గా ఫిక్సయిన మేకర్స్ ఇంట్రెస్టింగ్ టైటిల్ ని ఇప్పటికే ఫిక్సయ్యారని సమాచారం.

జూలై 30, 2020 న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా పక్కా ప్లానింగ్ ప్రకారం షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాకి కీరవాణి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ నటి ఆలియా భట్ హీరోయిన్ గా నటిస్తుంది. అజయ్ దేవ్ గన్ ఓ కీ రోల్ లో కనిపించనున్నాడు.