#RRR షూటింగ్ అప్ డేట్!

Sunday,July 26,2020 - 02:19 by Z_CLU

ఎన్టీఆర్, రామ్ చరణ్ తో రాజమౌళి తెరకెక్కిస్తున్న మోస్ట్ ఎవైటింగ్ మల్టీ స్టారర్ ‘RRR’సినిమాకు సంబంధించి అభిమానుల్లో ఎన్నో సందేహాలు.. వాటిలో ఒకటి షూటింగ్ అప్ డేట్. అవును అసలు లాక్ డౌన్ కంటే ముందు ఈ సినిమాకు సంబంధించి ఎంత శాతం షూట్ పూర్తీ చేసారనేది పెద్ద సందేహమే. అయితే అభిమానుల్లో ఉన్న ఆ సందేహానికి సమాధానం దొరికింది. సినిమాకు కెమెరామెన్ గా వర్క్ చేస్తున్న సెంథిల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమా దాదాపు 70 శాతం పూర్తయిందని తెలిపాడు.

ఇక షూటింగ్ తో పాటు ఎడిటింగ్, డబ్బింగ్ కార్యక్రమాలు కూడా సమాంతరంగా నడిచేవని కానీ ఉన్నపళంగా లాక్ డౌన్ ప్రకటించడంతో షూటింగ్ వాయిదా వేసుకోవాల్సి వచిందని అన్నాడు. సాధ్యమైనంత త్వరగా మళ్ళీ షూటింగ్ మొదలు పెడతామనే నమ్మకం ఉందని తెలిపాడు. దీంతో #RRR 30 శాతం షూటింగ్ మాత్రమే మిగిలి ఉందనే విషయం బయటికొచ్చింది. మరి జక్కన్న అండ్ టీం బ్యాలెన్స్ షూట్ ను వేగంగా పూర్తి చేసి సంక్రాంతి డేట్ ను అందుకుంటారా …? లేదా వచ్చే ఏడాది సమ్మర్ కల్లా రెడీ చేస్తారా వేచి చూడాలి.