హీరో నాని ఇంటర్వ్యూ

Saturday,September 07,2019 - 01:34 by Z_CLU

‘నానీస్ గ్యాంగ్ లీడర్’ తో సెప్టెంబర్ 13న థియేటర్స్ రాబోతున్నాడు నేచురల్ స్టార్. విక్రం తో ఫస్ట్ టైం సినిమా చేసిన నాని అదిరిపోయే ఎంటర్టైన్ మెంట్ ఇస్తానని అంటున్నాడు. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా మీడియాతో ముచ్చటించాడు నాని. ఆ విశేషాలు గ్యాంగ్ లీడర్ మాటల్లోనే..

చాలా అనుకున్నాం

నేను విక్రం సినిమా చేద్దామనుకొని రకరకాల ఐడియాస్ డిస్కస్ చేశాం. చాలా ఎగ్జైటింగ్ పాయింట్స్ చెప్పాడు. కానీ ఇంకేదో ఇంకేదో అనుకుంటూ వచ్చాం. సరిగ్గా జెర్సీ షూటింగ్ స్టార్ట్ చేసే ముందు ఒక రోజు ఆఫీస్ కి వచ్చి గ్యాంగ్ లీడర్ స్క్రిప్ట్ చెప్పాడు. అప్పటికి ఇంకా టైటిల్ అనుకోలేదు. ఐడియా బాగా నచ్చి ఇమిడియట్లీ ఒకే అనుకున్నాం. సో జెర్సీ తర్వాత చేద్దాం అనుకున్నాం.

చాలా సింపుల్

విక్రం గత సినిమాల్లో స్క్రీన్ ప్లే ఓ పజిల్ లా ఉంటుంది. అయితే ఈ సినిమా అలా ఉండదు. చాలా సింపుల్ సినిమా. కొన్ని ట్విస్టులు ఉన్నప్పటికీ సినిమా అందరికీ అర్థమయ్యేలా సింపుల్ స్క్రీన్ ప్లే తో ఉంటుంది. మోస్ట్ ఎంటర్టైనింగ్ ఫిలిం మోస్ట్ లెస్ కాంప్లికేటెడ్ ఫిలిం అని చెప్పొచ్చు.

వరల్డ్ పాపులర్ అనుకుంటాడు

సినిమాలో నేను పెన్సిల్ పార్థసారథి అనే క్యారెక్టర్ ప్లే చేసాను. బుక్స్ రాస్తూ ఉంటాడు. రైటర్ గా వాడు వరల్డ్ పాపులర్ అనుకుంటాడు. కానీ వాడి బుక్స్ పెద్దగా సెల్ అవ్వవు అది పబ్లిషర్ మాత్రమే తెలుసు.

టైటిల్ క్రెడిట్ విక్రంకే

‘జెర్సీ’ సినిమా కోసం క్రికెట్ ట్రైనింగ్ తీసుకుంటున్న టైంలో విక్రం ఎదురుగా కుర్చీలో కూర్చొని ఉన్నాడు. అప్పుడే సినిమాకు టైటిల్ అనుకున్నాను ఎలా ఉంది అంటూ గ్యాంగ్ లీడర్ టైటిల్ చెప్పాడు. వినగానే హ్యాపీ గా ఉంది.

 

సినిమాలో అదే కొత్తగా ఉంటుంది

తెలుగులో ఇప్పటికే చాలా రివేంజ్ సినిమాలొచ్చాయి. కాకపోతే గ్యాంగ్ లీడర్ లో ఎంటర్టైన్ మెంట్ మిక్స్ చేసిన రివేంజ్ స్టోరీ ఉంటుంది. అది మన ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగిస్తుందని నమ్ముతున్నాను.

వాళ్ళే నాకు స్ట్రెంగ్త్

సినిమాలో లక్ష్మీ గారు శరణ్య గారు అదిరిపోయే కామెడీ టైమింగ్ తో ఎంటర్టైన్ చేస్తారు. కొన్ని సీన్స్ లో నా కామెడీ టైమింగ్ కి వాళ్ళ కామెడీ టైమింగ్ కి భలే సింక్ అయ్యింది. నిజానికి వాళ్ళే నాకు స్ట్రెంగ్త్ ఆ సన్నివేశాలను ప్రేక్షకులు థియేటర్స్ లో బాగా ఎంజాయ్ చేస్తారు.

ఇంట్రెస్టింగ్ రోల్ అందుకే

సినిమాలో కార్తికేయ చేసిన క్యారెక్టర్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. విక్రం చెప్పినప్పుడు తను చేస్తాడా లేదా అనుకున్నాను. కానీ వన్స్ విక్రం వెళ్లి స్క్రిప్ట్ చెప్పి కార్తికేయ ఒకే అన్నాడు అనగానే హ్యాపీగా ఫీలయ్యాను. చాలా ఇంట్రెస్టింగ్ రోల్ అది. ఎవరైనా హీరో చేస్తే బాగుంటుంది అనిపించింది. అందుకే కొందరు హీరోలను ఆ క్యారెక్టర్ కోసం అనుకున్నాం. ఫైనల్ గా కార్తికేయ చేసాడు. సినిమా రిలీజ్ తరువాత కచ్చితంగా ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడతారు.

పెద్దగా డిస్కస్ చేయలేదు

అనిరుద్ మ్యూజిక్ లో ఒక ఎనర్జీ ఉంటుంది. అందుకే ఈ సినిమా కోసం తనని తీసుకున్నాం. పైగా విక్రం కూడా అనిరుద్ తో సినిమా చేయాలనీ ఎప్పటి నుండో అనుకుంటున్నాడట. ‘జెర్సీ’ కి అనిరుద్ కరక్టేనా అని చాలా ఆలోచించాం… కానీ ఈ సినిమాకు పెద్దగా డిస్కస్ చేయకుండానే పర్ఫెక్ట్ అనిపించి ఫైనల్ చేసేసాం.

జెర్సీ …ఎక్స్ ట్రీంలీ హ్యాపీ

‘జెర్సీ’ విషయంలో నేను ఎక్స్ ట్రీంలీ హ్యాపీ. తెలుగు సినిమాకు ఉన్న కొన్ని పరిధిలు దాటి మేము చేసిన ప్రయోగమది. వరల్డ్ వైడ్ గా థియేట్రికల్ రైట్స్ ముప్పై కోట్లు కలెక్ట్ చేసిన సినిమా అది. ఇప్పుడు అన్ని భాషల్లో రీమేక్ చేస్తున్నారు. అందుకే జెర్సీ విషయంలో కానీ అనుకున్నంత ఆడలేదు అనే మాట కరెక్ట్ కాదు. నిజానికి థియేట్రికల్ రైట్స్ , రీమేక్ రైట్స్ , శాటిలైట్ రైట్స్ ఇప్పుడు చైనాలో రిలీజ్ అవుతుంది. ఇలా మేకర్స్ కు ప్రాఫిట్ సినిమా అనిపించుకుంది. ఇవన్నీ తెలియకుండా సినిమా ఆవరేజ్ అనడం అస్సలు కరెక్ట్ కాదేమో.

బైలింగ్వల్ సినిమా భయం

ఇంతకు ముందు నేను బైలింగ్వెల్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఎంత టైం వేస్ట్ అయిందో … ఏం జరిగిందో తెలుసు. అందుకే నాకు బైలింగ్వెల్ అంటే భయం. అదిరిపోయే స్క్రిప్ట్ తో మంచి సెటప్ కుదిరి అలాగే రెండు రాష్ట్రాలకు బాగుంటుంది. అందరికీ నచ్చే ఎలిమెంట్స్ ఉన్నాయి అంటేనే బైలింగ్వెల్ సినిమా చేస్తాను. అంతే కాని ఊరికే బాగుంటుంది కదా, ఇంకో చోట కూడా కలెక్షన్స్ వస్తాయి కదా అని బైలింగ్వెల్ చేయడం కరెక్ట్ కాదని నా ఫీలింగ్.

V’ సినిమా తరువాతే

‘V’ సినిమా రెండో షెడ్యుల్ ఈ నెల 15 నుండి థాయిలాండ్ లో మొదలవుతుంది. నెక్స్ట్ మూడు సినిమాలు పైప్ లైన్ లో ఉన్నాయి. అందులో నెక్స్ట్ ఏది అనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు, ‘V’ సినిమా తరువాతే వాటి గురించి ఆలోచిస్తాను. హనుతో ప్రస్తుతం డిస్కర్షన్స్ జరుగుతున్నాయని అయితే ఇప్పుడే ఆ సినిమా గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు. దానికి ఇంకా టైం ఉంది.