వికారాబాద్ ఫారెస్ట్ లో RRR

Saturday,January 18,2020 - 10:02 by Z_CLU

RRR సినిమాలో రాజమౌళి మార్క్ హైలెట్స్ ఎన్ని ఉన్నా, ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేది రామ్ చరణ్, NTR కాంబినేషన్లో ఉండబోయే సీక్వెన్సెస్ కోసమే. అయితే అలాంటి పవర్ ప్యాక్డ్ యాక్షన్ సీక్వెన్సెస్ ని నెక్స్ట్ షెడ్యూల్ లో వికారాబాద్ ఫారెస్ట్ లో షూట్ చేయనుంది RRR టీమ్.

జనవరి 20 నుండి స్టార్ట్ కాబోయే ఈ షెడ్యూల్ వరసగా 15 రోజులు ఉండబోతుంది. RRR లో ఎగ్జాక్ట్ గా ఏ సందర్భంలో ఉండబోతుందన్నది గెస్ చేయలేం కానీ, ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకి హైలెట్ కానుందని తెలుస్తుంది.

భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సముద్రఖని, రాహుల్ రామకృష్ణ, రే స్టీవెన్ సన్ తో పాటు ఆలిసన్ డూడీ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. D.V.V. దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా, వరల్డ్ వైడ్ గా జూలై 30 న రిలీజ్ కానుంది.