గెట్ రెడీ.. పవర్ ప్యాక్డ్ గా వస్తున్న సైరా ట్రయిలర్

Saturday,September 07,2019 - 11:30 by Z_CLU

టీజర్ తో ఇప్పటికే సంచలనం సృష్టించింది సైరా. ఇప్పుడు ట్రయిలర్ తో హల్ చల్ చేయబోతోంది. అవును.. సైరా ట్రయిలర్ సిద్ధమైంది. ఈ ట్రయిలర్ ఫైనల్ కట్ కు చిరంజీవి ఓకే చెప్పారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే వారమే సైరా ట్రయిలర్ మార్కెట్లోకి రానుంది.

టీజర్ లో చూపించినట్టుగానే ట్రయిలర్ లో కూడా భారీతనం చూపించబోతున్నారు. దీనికితోడు టీజర్ కు భిన్నంగా ట్రయిలర్ లో స్టోరీలైన్ ను కూడా చూపించబోతున్నారు. మెగాఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్ ఏంటంటే.. ట్రయిలర్ తో పాటు టైటిల్ సాంగ్ వీడియో కూడా సిద్ధమైంది. దాదాపు 5 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ వీడియోను ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో ప్లే చేసే ఉద్దేశంతో ఉన్నారు.

ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదు. వెన్యూ మాత్రం కర్నూల్ లో ఫిక్స్ అయింది. ఆ తర్వాత బెంగళూరులో సుదీప్ సమక్షంలో మరో భారీ ఈవెంట్ ప్లాన్ చేశారు. ముంబయి, చెన్నైలో చెరొక ప్రెస్ మీట్ ప్లాన్ చేశారు. వీటితో పాటు కుదిరితే నార్త్ లోని పూణె, ఇండోర్, లక్నో లాంటి పట్టణాల్లో కూడా పర్యటించాలని అనుకుంటున్నారు. ఇలా భారీగా ప్రచారం కల్పించి, అక్టోబర్ 2న సైరాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.