గ్రౌండ్ వర్క్ లో రాజుగారి గది

Monday,January 16,2017 - 01:30 by Z_CLU

 నాగార్జున, ఓంకార్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న రాజుగారి గది కన్స్ ట్రక్షన్ బిగిన్ అయిపోయింది. రేపో మాపో సెట్స్ పైకి రానున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ ని ఫాస్ట్ ఫాస్ట్ గా పూర్తి చేసే పనిలో పడ్డాడు ఓంకార్. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాకి ఆల్ రెడీ ఇంట్రడక్షన్ సాంగ్ కూడా ఫైనలైజ్ చేసేశాడు.

నాగ్ తన కరియర్ లోనే ఫస్ట్ టైం హారర్ జోనర్ లో నటిస్తున్నాడు. ప్రస్తుతం దర్శకేంద్రుని ఓం నమో వెంకటేశాయ పోస్ట్ ప్రొడక్షన్ అడ్మినిస్ట్రేషన్ లో బిజీగా ఉన్న నాగ్, ఎనీ టైం ఓంకార్ తో సెట్స్ పైకి రావచ్చు. ఈ లోపు మిగతా పనులకు ప్యాకప్ చెప్పే పనిలో ఉన్నాడు ఓంకార్.

రాజు గారి గది సక్సెస్ తో నాగ్ సినిమాని డైరెక్ట్ చేసే చాన్స్ కొట్టేసిన ఓంకార్, ఈ సినిమాతో టాప్ డైరెక్టర్స్ క్యాటగిరీ ని రీచ్ అయ్యే ప్లాన్ లో ఉన్నాడు. మరి ఈ సినిమాలో మన మన్మధుడు చేత ఫ్యాన్స్ ని ఏ రేంజ్ లో భయపెడతాడో చూడాలి.