బాలయ్య కరియర్ లో ఇదే ఫస్ట్ టైం

Monday,January 16,2017 - 12:30 by Z_CLU

హై ఎండ్ ఎక్స్ పెక్టేషన్స్ మధ్య రిలీజైన బాలయ్య 100 వ చిత్రం చారిత్రాత్మక కథాంశం కావడం ఈ సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ అయితే, రీసెంట్ గా అబ్బాయి NTR, సినిమా చూసి అభినందించడం మరో ఎట్రాక్షన్. రీసెంట్ గా ఈ సినిమా చూసిన NTR బాబాయ్ ని, డైరెక్టర్ క్రిష్ ని పొగడ్తలతో ముంచెత్తాడు.

అటు ప్రశంసలతో పాటు, ఇటు బాక్సాఫీస్ దగ్గర వసూళ్ళ విషయంలోనూ స్పీడ్ గా దూసుకుపోతున్న గౌతమీపుత్ర శాతకర్ణీ శనివారం సాయంత్రం కల్లా USA లో 1.01 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది. బాలయ్య కరియర్ లో ఓవర్ సీస్ మిలియన్ మార్క్ ని క్రాస్ చేయడం ఇదే ఫస్ట్ టైం.

సినిమా రిలీజ్ తరవాత వస్తున్న పాజిటివ్ రివ్యూస్ తో పాటు, మౌత్ టాక్ కూడా ఆడ్ అయ్యేసరికి ఒక్కసారిగా శనివారం నుండి బాక్సాఫీస్ దగ్గర వెయిట్ పెంచుకున్న గౌతమీపుత్ర శాతకర్ణీ, శనివారం కల్లా ఈజీగా 1 మిలియన్ డాలర్లు ఈజీగానే వసూలు చేసింది.