రియల్ లైఫ్ క్యారెక్టర్ లో నటించిన నాగార్జున

Wednesday,September 20,2017 - 05:35 by Z_CLU

నాగార్జున ‘రాజు గారి గది 2’ ట్రేలర్ ఈ రోజే రిలీజయింది. అటు హారర్ తో పాటు హిలేరియస్ ఎలిమెంట్స్ తో రిలీజైన ఈ ట్రైలర్ అందరినీ ఇంప్రెస్ చేసేసింది. అక్టోబర్ 13 న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమాలో నాగ్ మెంటలిస్టు గా నటిస్తున్నాడు. అయితే ఈ క్యారెక్టర్ రియల్ లైఫ్ క్యారెక్టర్ నుండి స్ఫూర్తి పొంది చేసిన క్యారెక్టర్ అని చెప్పుకున్నాడు నాగార్జున.

నాగార్జున కరియర్ లోనే ఫస్ట్ టైమ్ హారర్ జోనర్ లో నటించడం ఇంటరెస్టింగ్ పాయింట్ అయితే, నాగ్ నటించిన క్యారెక్టర్ కేరళ లోని ఓ మెంటలిస్టు ను రిఫరెన్స్ గా తీసుకున్నది కావడం, ఈ  సినిమాపై స్పెషల్ ఇంట్రెస్ట్ ని జెనెరేట్ చేస్తుంది.

ఓంకార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో సమంతా దెయ్యం క్యారెక్టర్ లో కనిపించనుంది. ఈ సినిమాకి S.S. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ప్రసాద్ వి. పొట్లూరి, కవిన్ అన్నే సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.