నాని, హరీష్ శంకర్ కాంబో

Monday,January 16,2017 - 02:25 by Z_CLU

హీరోస్ ను మోస్ట్ ఎగ్రెసివ్ అండ్ ఎనర్జిటిక్ గా చూపించడంలో హరీష్ శంకర్ ది డిఫరెంట్ స్టయిల్. మరీ ముఖ్యంగా హీరోస్ మేనరిజమ్స్ కు తగ్గట్టు క్యారెక్టర్స్ రాసుకొని, వాళ్ల హీరోయిజంను మరింత ఎలివేట్ చేయడం ఈ డైరక్టర్ స్టయిల్. గతంలో పవన్ కల్యాణ్ ను గబ్బర్ సింగ్ సినిమాలో ఇలానే చూపించిన ఈ దర్శకుడు… ప్రస్తుతం బన్నీని డీజేగా మరింత కొత్తగా చూపించే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ గ్యాప్ లో హరీష్ శంకర్ కన్ను హీరో నానిపై పడింది.

నాని నటించిన నేను లోకల్ ట్రయిలర్ తాజాాగా విడుదలైంది. ఇలా రిలీజైైందో లేదో అలా ఇనిస్టెంట్ గా హిట్ అయింది ఈ ట్రయిలర్. దర్శకుడు హరీష్ శంకర్ ను కూడా ఇది బాగా ఎట్రాక్ట్ చేసింది. ట్విట్టర్ లో తనదైన స్టయిల్ లో రియాక్ట్ అయ్యే హరీష్… ఈ ట్రయిలర్ చూసిన వెంటనే నానితో వర్క్ చేయాలని ఉందంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ చూసిన నాని కూడా రియాక్ట్ అయ్యాడు. నేను రెడీ… తొందరగా పని ప్రారంభించు భయ్యా అంటూ రీట్వీట్ చేశాడు.