మహాభారతంలో కర్ణుడిగా నాగార్జున...

Wednesday,May 24,2017 - 09:03 by Z_CLU

సీనియర్ హీరోల క్యాటగిరీలో ఇప్పటికీ రొమాంటిక్ గా, యంగ్ అండ్ హ్యాండ్సమ్ క్యారెక్టర్స్ చేస్తూ ఎట్రాక్ట్ చేస్తున్న నాగార్జున, ప్రొడ్యూసర్ గా కూడా అంతే సక్సెస్ ఫుల్ గా ఉన్నారు. అటు అఖిల్ కరియర్ తో పాటు, ఇటు నాగ చైతన్య సక్సెస్ లోను కీ డెసిషన్ మేకర్ లా ఉండే నాగార్జున, ఇప్పుడు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘మహాభారతం’లోను కనిపించనున్నారు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ‘మహాభారతం’ సినిమాలో కర్ణుడి రోల్ చేయడానికి నాగార్జునని అప్రోచ్ అయిందట సినిమా యూనిట్. కాస్త డిఫరెంట్ గా ఉండి పర్ఫామెన్స్ కి స్కోప్ ఉండాలి కానీ కింగ్ ఎందుకు కాదంటాడు. మొత్తానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

డిఫెరెంట్ క్యారెక్టర్స్ తో ఇప్పటి వరకు టచ్ కూడా చేయని జోనర్ లో కూడా నటిస్తూ మెప్పిస్తున్న నాగార్జున, కర్ణుడి రోల్ అనగానే టాలీవుడ్ లో అప్పుడే వైబ్రేషన్స్ బిగిన్ అయిపోయాయి. ఇక సినిమా సెట్స్ పైకి వచ్చిందంటే వార్ వన్ సైడ్ అయినట్టే.