ధనుష్ డైరెక్షన్ లో నాగార్జున

Wednesday,May 30,2018 - 06:36 by Z_CLU

నాగార్జున ‘ఆఫీసర్’ జూన్ 1 న గ్రాండ్ గా రిలీజవుతుంది. ఈ సినిమాతో పాటు నాగ్ ఆల్రెడీ శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ లో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా తరవాత ఇమ్మీడియట్ గా ధనుష్ డైరెక్షన్ లో నటించనున్నాడని తెలుస్తుంది.

రీసెంట్ గా ‘పా పాండి’ సినిమాతో సెన్సిబుల్ డైరెక్టర్ అనిపించుకున్న ధనుష్, ప్రస్తుతం తన డైరెక్షన్ లో తెరకెక్కనున్న నెక్స్ట్ సినిమా ప్రిపరేషన్స్ లో ఉన్నాడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కించే ప్రాసెస్ లో ఉన్న ధనుష్, తెలుగులో నాగార్జున తో సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ విషయంలో ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు.

ఆ మధ్య ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సీక్వెల్ ‘బంగార్రాజు’ ప్లాన్ చేస్తానని చెప్పిన నాగార్జున, మరి ధనుష్ సినిమా తరవాతే ఈ సీక్వెల్ గురించి ఆలోచిస్తాడా..? అనేది ఇంకొన్ని రోజుల్లో తెలిసిపోతుంది.