నాగార్జున రాజుగారి గది 2 సెట్స్ పైకి

Monday,February 13,2017 - 04:10 by Z_CLU

రీసెంట్ గా రిలీజైన ఓం నమో వెంకటేశాయ ఫీవర్  థియేటర్స్ లో కించిత్ కూడా తగ్గనే లేదు. అంతలో నాగార్జున ఓంకార్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న రాజుగారి గది 2 సీక్వెల్ తో సెట్స్ పైకి రాబోతున్నాడు. ఫిబ్రవరి 17 నుండి సెట్స్ పైకి రానున్న రాజుగారి గది 2 ఫాస్ట్ పేజ్ లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోవడాని రెడీ అయిపోయింది.

సమంతా కీ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమా హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కనుంది. ఇంతకు ముందు రాజు గారి గదిలో హీరోగా చేసిన ఓంకార్ తమ్ముడు అశ్విన్ కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడు.

nagarjuna-story_650_042715013407

ఈ సినిమా స్క్రిప్ట్ వినీ వినగానే ఓంకార్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాగ్, తన కరియర్ లోనే ఫస్ట్ టైం హారర్ థ్రిల్లర్ లో నటిస్తున్నాడు. అటు ఓంకార్ కూడా తన కరియర్ లోనే ఫస్ట్ టైం నాగ్ లాంటి బడా హీరోకి డైరెక్టర్ గా పని చేస్తున్నాడు. సినిమా సూపర్ హిట్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా సినిమా యూనిట్ ఫిబ్రవరి 17 ఫుల్ ఫ్లెజ్డ్ గా బిజీ కానుంది.