భారీ రేంజ్ లో 2.0 ప్రమోషన్స్

Thursday,June 29,2017 - 02:00 by Z_CLU

సూపర్ స్టార్ రజనీకాంత్ – శంకర్ కాంబినేషన్ లో హై టెక్నికల్ వాల్యూస్ తో భారీగా తెరకెక్కుతున్న మోస్ట్ ఎవైటింగ్ మూవీ ‘2.0’ సినిమాకు సంబంధించి అధికారిక ప్రచారం ప్రారంభమైంది. లాస్ ఏంజెల్స్ లో హాలీవుడ్ దగ్గర ఈ సినిమా ప్రమోషన్ ను హాట్ ఎయిర్ బెలూన్ తో స్టార్ట్ చేశారు.

హాలీవుడ్ వద్ద భారీగా కనిపిస్తూ ఎట్రాక్ట్ చేస్తోంది ‘2.0’ హాట్ ఎయిర్ బెలూన్. రోబో సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజనీ సరసన అమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తుండగా అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్నాడు. ‘శివాజీ’, ‘రోబో’ సినిమాల తర్వాత రజనీ-శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా పై వరల్డ్ వైడ్ గా భారీ అంచనాలే ఉన్నాయి. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాను జనవరి 25న రిలీజ్ చేస్తారు.