ఇద్దరు దర్శకుల మధ్యలో..

Thursday,June 29,2017 - 03:00 by Z_CLU

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న నాని, ఇద్దరు దర్శకుల దగ్గర ఆగిపోయాడు. వాళ్లలో ఎవరికి ఈ నేచురల్ స్టార్ ఛాన్స్ ఇస్తాడనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. వాళ్లిద్దరే మేర్లపాక గాంధీ, శ్రీరామ్ ఆదిత్య. ఇద్దరూ హిట్ డైరక్టర్లే. ఇద్దరూ మంచి స్టోరీలైన్సే చెప్పారు. ఇప్పుడు డెసిషన్ నాని చేతిలోనే ఉంది.

నిన్ను కోరి సినిమాను విడుదలకు సిద్ధంచేశాడు నాని. జులై 7న ఆ సినిమా థియేటర్లలోకి వస్తోంది. ఆ మూవీ తర్వాత దిల్ రాజు బ్యానర్ లో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఎంసీఏ సినిమా చేస్తాడు. ఆ సినిమా కూడా కంప్లీట్ అయిన తర్వాత నెక్ట్స్ డైరక్టర్ ఎవరనే విషయంపై నిర్ణయం తీసుకుంటాడు నాని.

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా సినిమాలతో సక్సెస్ అందుకున్నాడు మేర్లపాక గాంధీ. నానితో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు. మరోవైపు శ్రీరామ్ ఆదిత్య అనే దర్శకుడు భలే మంచి రోజు సినిమాతో అందరి దృష్టిని ఎట్రాక్ట్ చేశాడు. శమంతకమణి సినిమాను రిలీజ్ కు రెడీ చేశాడు. కుదిరితే నెక్ట్స్ మూవీని నానితో ప్లాన్ చేయాలనుకుంటున్నాడు. ఈ ఇద్దర్లో ఎవరికి నాని ఛాన్స్ ఇస్తాడో చూడాలి.