స్పైడర్ సెకండ్ టీజర్ రిలీజ్ డేట్

Thursday,June 29,2017 - 12:55 by Z_CLU

టాలీవుడ్ లో మోస్ట్ అవేటెడ్ మూవీ ‘స్పైడర్’ సెకండ్ టీజర్ రిలీజ్ కి రెడీ అయింది. రీసెంట్ గా రిలీజైన టీజర్ సినిమాపై క్యూరాసిటే రేజ్ చేస్తే, ఈ సెకండ్ టీజర్ తో సినిమా స్టాండర్డ్స్ ని ఎలివేట్ చేసే ప్రాసెస్ లో ఉంది స్పైడర్ టీమ్.

ఫస్ట్ టీజర్ లో కంప్యూటర్ ముందు పని చేస్తున్న సూపర్ స్టార్ తో పాటు రోబో స్పైడర్ ని ఇంట్రడ్యూస్ చేసిన ఫిల్మ్ మేకర్స్, సెకండ్ టీజర్ ని డిఫెరెంట్ గా ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఫస్ట్ టీజర్ తో సినిమాలోని టెక్నికల్ స్టాండర్డ్స్ హైలెట్ చేసిన సినిమా యూనిట్, ఈ సెకండ్ టీజర్ లో సినిమాకి సంబంధించిన ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఏమైనా హైలెట్ అవుతాయని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

మురుగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ స్టైలిష్ ఎంటర్ టైనర్ లో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. హరీష్ జయరాజ్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.