రజినీకాంత్ 2.0 రన్ టైమ్ లాకయింది

Thursday,January 11,2018 - 05:52 by Z_CLU

రజినీకాంత్ 2.0 రన్ టైమ్ లాకయింది. ఏప్రియల్ 14 న రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. వరల్డ్ వైడ్ గా హై డిమాండ్ క్రియేట్ చేసిన ఈ సినిమాకి 100 నిమిషాల రన్ టైమ్ లాక్ చేసింది 2.0  టీమ్.

ఫాస్ట్ పేజ్ లో మూవ్ అయ్యే స్క్రీన్ ప్లే తో క్రిస్పీ గా ఉండబోయే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా తమిళ, తెలుగు, హిందీ, అరబిక్ భాషల్లో ఒకేసారి రిలీజ్ కానుంది. శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ సినిమా లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది. అక్షయ్ కుమార్ విలన్ రోల్ ప్లే చేసిన ఈ సినిమాలో రజినీకాంత్ సరసన ఎమీ జాక్షన్ హీరోయిన్ గా నటించింది. A.R. రెహమాన్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజర్.