జీ సినిమాలు ( 12th జనవరి )

Thursday,January 11,2018 - 10:03 by Z_CLU

తెలుగమ్మాయి

నటీనటులు : సలోని, విక్రమ్

ఇతర నటీనటులు : యశ్వంత్, హర్ష, సాయిచంద్, షఫీ, తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : వందేమాతరం శ్రీనివాస్

డైరెక్టర్ : రాజా వన్నెం రెడ్డి

ప్రొడ్యూసర్ : వనపల్లి బాబు రావు

రేపిస్టును చంపడం నేరమా..? అనే కథాంశంతో తెరకెక్కిందే తెలుగమ్మాయి. సలోని తెలుగమ్మాయిగా ఎట్రాక్ట్ చేస్తుంది. వందేమాతరం శ్రీనివాస్ సంగీతం సినిమాకే హైలెట్.

=============================================================================

 

మహానంది

నటీనటులు – సుమంత్, అనుష్క

ఇతర నటీనటులు – శ్రీహరి, సుమన్, కోటశ్రీనివాసరావు, సాయికిరణ్

సంగీత దర్శకుడు –  కృష్ణమోహన్

దర్శకుడు – సముద్ర

విడుదల తేదీ – 2005, డిసెంబర్ 3

సూపర్ సినిమాతో కెరీర్ ప్రారంభించిన అనుష్క.. తన రెండో ప్రయత్నంగా చేసిన మూవీ మహానంది. సూపర్ తో సక్సెస్ కొట్టిన స్వీటీ… మహానందితో కూడా మరో సక్సెస్ అందుకుంది. ఆర్ ఎస్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీహరి ఓ పవర్ ఫుల్ పాత్ర పోషించారు. ఈ సినిమా హిందీలో ఏక్ ఔర్ మహాయుధ్… మలయాళంలో ఉల్లాసం పేర్లతో డబ్ అయింది.

==============================================================================

ముత్తు

నటీనటులు : రజినీకాంత్, మీనా

ఇతర నటీనటులు : రఘువరన్, శరత్ బాబు, జయ భారతి, వడివేలు, కాంతిమతి, రాధా రవి మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : A.R. రెహమాన్

డైరెక్టర్ : K.S. రవికుమార్

ప్రొడ్యూసర్ : రాజం బాలచందర్

రిలీజ్ డేట్ : 23 అక్టోబర్ 1995

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన ముత్తు సెన్సేషనల్ హిట్ అయింది. రాకుమారుడైన ముత్తు, అతని కుటుంబ సభ్యులు చేసిన కుట్ర వల్ల పనివాడిలా పెరుగుతాడు. పెరిగి పెద్దవాడైన ముత్తు తన అధికారాన్ని ఎలా సాధించుకున్నాడు. అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.  

=============================================================================

లక్కున్నోడు

నటీనటులు : విష్ణు మంచు, హన్సిక మోత్వాని

ఇతర నటీనటులు : రఘుబాబు, జయప్రకాష్, పోసాని కృష్ణమురళి, ప్రభాస్ శ్రీను, సత్యం రాజేష్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : ప్రవీణ్ లక్కరాజు

డైరెక్టర్ : రాజ కిరణ్

ప్రొడ్యూసర్ : M.V.V. సత్య నారాయణ

రిలీజ్ డేట్ : జనవరి 26, 2017

చిన్నతనం నుంచి లక్ వెంట తెచ్చి అంతలోనే లక్ ను దూరం చేసే లక్కీ(విష్ణు) ని అన్ లక్కీ గా భావించి దూరం పెడతాడు లక్కీ తండ్రి భక్త వత్సల. ఇక ఉద్యోగ అవకాశం కోసం హైదరాబాద్ వచ్చిన లక్కీ కి పాజిటీవ్ గా ఆలోచించే పద్మ(హన్సిక ) పరిచయం అవుతుంది. తొలి చూపులోనే పద్మ ను చూసి ప్రేమలో పడిన లక్కీ, పద్మ ను ఎలా దక్కించుకున్నాడు? ఈ క్రమంలో తన అన్ లక్ కి కారణమైన జె.కె(ఎం.వి.వి.సత్యనారాయణ)ను ఎలా ఎదుర్కున్నాడు? చివరిగా 25 ఏళ్ళు దూరమైన తన తండ్రికి  మళ్ళీ ఎలా దగ్గరయ్యాడు? అనేది సినిమా కథాంశం.

==============================================================================

లింగ

నటీనటులు : రజినీకాంత్, అనుష్క శెట్టి, సోనాక్షి సిన్హా

ఇతర నటీనటులు : జగపతి బాబు, K. విశ్వనాథ్, N. సంతానం, కరుణాకరన్, దేవ్ గిల్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : A.R. రెహ్మాన్

డైరెక్టర్ : K.S. రవి కుమార్

ప్రొడ్యూసర్ : రాక్ లైన్ వెంకటేష్

రిలీజ్ డేట్ : 12 డిసెంబర్ 2014

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన డైరెక్ట్ సినిమా ‘లింగ’. రెండు డిఫరెంట్ బ్యాక్ డ్రాప్స్ ఓ ఉండే ఈ సినిమాలో రజినీకాంత్ డ్యూయల్ రోల్ ప్లే చేశాడు.  అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించాడు.

==============================================================================

పంచాక్షరి

నటీనటులు : అనుష్క శెట్టి, చంద్ర మోహన్

ఇతర నటీనటులు : నాజర్, ప్రదీప్ రావత్, రవి ప్రకాష్, బ్రహ్మానందం, దివ్యవాణి, తెలంగాణ శకుంతల మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : చిన్నా

డైరెక్టర్ : V. సముద్ర

ప్రొడ్యూసర్ : బొమ్మదేవర రామ చంద్రరావు

రిలీజ్ డేట్ : 11 జూన్ 2010

హై ఎండ్ టెక్నికల్ వ్యాల్యూస్ తో తెరకెక్కిన ఫ్యామిలీ థ్రిల్లర్ పంచాక్షరి. దుర్గామాత గుడిలో పుట్టిన పంచాక్షరిని ఊళ్లూ వాళ్ళు దుర్గాదేవిలా ట్రీట్ చేస్తుంటారు. కానీ ఒక మహా పర్వదినాన పంచాక్షరి గుడిలో నిప్పుకు ఆహుతై పోతుంది. దాంతో దుర్గమ్మ వారే పంచాక్షరి ప్రాణాలు ఆహుతి చేశారు అనే భ్రమలో ఉంటారు ఊరి జనం. కానీ నిజం తరవాత బయటికి వస్తుంది, నిజానికి పంచాక్షరిని చంపింది ఎవరు..? ఆ తరవాత ఏం జరిగింది అనేదే ప్రధాన కథాంశం.