2.0 నేర్పిన 5 విషయాలు

Monday,December 03,2018 - 05:31 by Z_CLU

భారీ అంచనాల మధ్య రిలీజైంది రజినీకాంత్ 2.0. సిల్వర్ స్క్రీన్ పై ఫస్ట్ ఎవర్ విజువల్ వండర్ ని ఎక్స్ పీరియన్స్ చేయబోతున్నామనే క్లారిటీ ఆడియెన్స్ కి బిగినింగ్ నుండే ఉంది. అయితే ఆ అంచనాలకు 100 % ధీటుగా నిలిచింది 2.0. అయితే ఈ సినిమా జస్ట్ బాక్సాఫీస్ దగ్గర రికార్డ్స్ మాత్రమే క్రియేట్ చేయడం లేదు. ఫిల్మ్ మేకింగ్ లో రివొల్యూషన్ తీసుకొచ్చింది.

ప్రతీది పాయింటే : పక్షుల చావుకు మనుషులు కారణమవుతున్నారనే ఒక్క రీజన్ తో, వరసగా మనుషులను చంపుతుంటాడు విలన్. నిజం చెప్పాలంటే సో సిల్లీ రీజన్. కానీ ఈ పాయింట్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు దర్శకుడు శంకర్. విజువల్స్ విషయంలో క్లారిటీ ఉండాలి కానీ, ప్రతీది పాయింటే అని నిరూపించింది 2.0.

విలన్ ఫార్మాట్ : విలన్ అంటే కంపల్సరీగా తప్పులే చేయాలి. రజినీకాంత్ లాంటి పెద్ద స్టార్ సినిమాలైతే ఇంకా కరుడుగట్టిన కసాయితనం ఉండాలి. అప్పుడే హీరో క్యారెక్టర్ ఎలివేట్ అవుతుంది. ఈ ఫార్మాట్ ని ఒక్కసారిగా ఫ్లిప్ చేసింది 2.0. ఒక మంచి కాజ్ కోసం ఫైట్ చేసే విలన్, బహుశా ఇండియన్ సినిమా హిస్టరీ లోనే ఫస్ట్ టైమ్. క్యారెక్టర్స్ కి పర్టికులర్ ఫార్మాట్ అవసరం లేదని తెగేసి చెప్పింది 2.0.

సాంగ్స్ నెవర్ రూల్స్ : సినిమా లాస్ట్ లో వచ్చే ‘యంతర లోకపు..’ సాంగ్ ని కాస్త పక్కన పెడితే, సినిమాలో ఉండే 2 సాంగ్స్ ఇమోషన్ ని ఎలివేట్ చేసేవే. ‘రండాలి’ సాంగ్ ( చిట్టి ) 2.0 వర్షన్ స్పీడ్ ని ఎలివేట్ చేస్తే, బుల్లి గువ్వ సాంగ్, పర్టికులర్ క్యారెక్టర్ కి, బర్డ్స్ పై ఉన్న అభిమానాన్ని ఎలివేట్ చేస్తుంది. కావాలని ఎక్కడా కమర్షియల్ ఎలిమెంట్ సాకుతో పాటల్ని బలవంతంగా ఎగ్జిక్యూట్ చేయలేదు ఫిల్మ్ మేకర్స్. పాటలు కమర్షియల్ ఎలిమెంట్స్ లో భాగం కాదని నిరూపించింది 2.0.

కామెడీ ట్రాక్స్ :  అంత పెద్ద సినిమా జస్ట్ 4 క్యారెక్టర్స్ మధ్య తిరిగిందా..? సినిమా చూసిన వాళ్ళు కూడా ఈ క్వశ్చన్ వినగానే ఒకసారి ఆలోచించడం బిగిన్ చేస్తారు. శంకర్ చేసిన మ్యాజిక్ అదే. కావాలని కనీసం కామెడీ ట్రాక్ కూడా పెట్టలేదు. జస్ట్ సింగిల్ స్టోరీ. రికార్డ్స్ బ్రేక్ చేయడం పెద్ద విషయమే కాదు అనిపించుకుంది 2.0.

మొబైల్స్ లైఫ్ స్టైల్స్ :  ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్. ఈ ఎలిమెంట్ ఫిల్మ్ మేకింగ్ కి సంబంధించింది కాకపోయినా, సినిమా చూసిన వాళ్లకు సంబంధించిందే. మనం ఇంతగా ఎడిక్ట్ అవుతున్న మొబైల్స్, మన ఉనికికి ఇంత ప్రమాదమా..? అనే ఆలోచనను రేకెత్తిస్తుంది 2.0.