2.0 రికార్డ్ బ్రేకింగ్ ప్రీ రిలీజ్ బిజినెస్

Friday,November 23,2018 - 11:02 by Z_CLU

రిలీజ్ కి ముందే 100 కోట్ల క్లబ్ లోకి చేరింది రజినీకాంత్ 2.0 సినిమా. వరల్డ్ వైడ్ గా భారీ డిమాండ్ మధ్య రిలీజవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 120  కోట్లు. వచ్చే గురువారం నుండి థియేటర్స్ లోకి రానున్న 2.0 రిలీజ్ తరవాత మరిన్ని రికార్డ్స్ క్రియేట్ చేయడం గ్యారంటీ అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.

సెల్ ఫోన్ నేపథ్యంలో ఇమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. దానికి తోడు ఫిల్మ్ మేకర్స్ అగ్రెసివ్ గా చేస్తున్న ప్రమోషన్స్, ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేస్తుంది. సినిమాలో రజినీకాంత్, అక్షయ్ కుమార్ కాంబినేషన్ లో ఉండబోతున్న సీస్స్ పై సోషల్ మీడియాలో భారీ స్థాయిలో స్పెక్యులేషన్స్ క్రియేట్ అవుతున్నాయి.

శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కింది 2.0. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకి A.R. రెహమాన్ మ్యూజిక్ కంపోజర్. ఎమీ జాక్సన్ హీరోయిన్ గా నటించింది.