రాసుకోండి సినిమా సూపర్ హిట్ – రజినీకాంత్

Monday,November 05,2018 - 11:49 by Z_CLU

కంప్లీట్ కాన్సంట్రేషన్ 2.0 సినిమాపై ఉంది. టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని మెస్మరైజ్ చేస్తుంది రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్.అయితే ఈ ట్రైలర్ లాంచ్ లో రజినీకాంత్ స్పీచ్ విన్న తరవాత 2.0 పై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి.

ఈ ఈవెంట్ లో ఫ్యాన్స్ ని ఉద్దేశించి మాట్లాడిన రజినీకాంత్ “ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గ్యారంటీ. కావాలంటే రాసుకోండి. నిర్మాత సుభాస్కరన్ ఈ సినిమా కోసం 600 కోట్లు ఖర్చు చేశారు. అదేదో నాకోసమో, అక్షయ్ కుమార్ కోసమో కాదు. 2.0 కోసం… దర్శకుడు శంకర్ విజన్ ని నిజం చేయడం కోసం…” అని చెప్పుకున్నాడు.

‘2.0 సినిమా థ్రిల్లర్, యాక్షన్ ఎంటర్ టైనరే కాదు, ఈ సినిమాలో ఇంటర్నేషనల్ మెసేజ్ కూడా ఉంటుందని చెప్పిన రజినీకాంత్, ఈ ప్లానెట్ జస్ట్ మనుషుల కోసమే కాదు,  ప్రాణం ఉన్న ప్రతి ఒక్క జీవరాశికి ఈ ప్లానెట్ పై బ్రతికే హక్కు ఉంది’ అని చెప్పుకున్నాడు సూపర్ స్టార్.

నవంబర్ 29 న గ్రాండ్ గా రిలీజవుతుంది 2.0 సినిమా. ఎమీ జాక్సన్ ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించనుంది. A.R. రెహమాన్ మ్యూజిక్ కంపోజర్. శంకర్ డైరెక్షన్ లో  లైకా ప్రొడక్షన్స్  బ్యానర్  పై  2.0 సినిమా తెరకెక్కింది.