2.0 క్లైమాక్స్ లో సస్పెన్స్ ఎలిమెంట్

Thursday,November 29,2018 - 03:00 by Z_CLU

ఫస్ట్ షో తోనే బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం రజినీకాంత్ 2.0. అంచనాలకు మించి మెస్మరైజ్ చేస్తుంది ఈ యాక్షన్ థ్రిల్లర్. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ లోని విజువల్స్ కొన్నాళ్ళ పాటు మైండ్ బౌండరీ దాటి బయటికి కూడా రాలేవు. ఈ సన్నివేశాలను చూస్తున్నంత సేపు ఇండియన్ సినిమా చూస్తున్నామా, లేకపోతే హాలీవుడ్ సినిమా  చూస్తున్నామా అనేంతలా మెస్మరైజ్ చేస్తుంది. అల్టిమేట్ గా ‘వర్త్ వెయిటింగ్’ అనిపిస్తుంది 2.0.

అయితే అప్పటి వరకు సీరియస్ మోడ్ లో వెళ్ళిన సినిమాకి క్లైమాక్స్ లో నెవర్ ఎక్స్ పెక్టెడ్ ఎలిమెంట్ ని ఆడ్ చేశాడు దర్శకుడు శంకర్. ఈ ఎలిమెంట్ స్క్రీన్ పై కనిపించింది కాసేపే అయినా, ఆడియెన్స్ ని కంప్లీట్ గా రిలాక్స్ మోడ్ లోకి తీసుకువెళ్ళింది. సినిమా అంతా ఒక ఎత్తైతే, ఈ సర్ ప్రైజ్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఎమీ జాక్సన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ బిగ్గెస్ట్ ఇండియన్ సినిమా, ఆల్రెడీ రికార్డులు బ్రేక్ చేసే ప్రాసెస్ ని బిగిన్ చేసేసింది. వరల్డ్ వైడ్ గా ఆడియెన్స్ ఫోకస్ 2.0 పైనే ఉంది.