2.0 రేపే గ్రాండ్ రిలీజ్

Wednesday,November 28,2018 - 12:45 by Z_CLU

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మూమెంట్ మరికొన్ని గంటల్లో నిజం కానుంది. హాలీవుడ్ టెక్నీషియన్స్ పని చేసిన ఇండియాస్ బిగ్గెస్ట్ మ్యాగ్నం ఓపస్ ‘2.0’ రేపు గ్రాండ్ గా రిలీజవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న ఫ్యాన్స్, సిల్వర్ స్క్రీన్ పై 2.0 గ్రాండియర్ ని ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నారు.

కంప్లీట్ గా 3D ఫార్మాట్ లో తెరకెక్కించాడు శంకర్ ఈ సినిమాని. దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో నెవర్ సీన్ బిఫోర్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ విజువల్ వండర్, ఇండియన్ సినిమా హిస్టరీలో సరికొత్త రికార్డ్స్ నమోదు చేయడానికి మరికొన్ని గంటలు మాత్రమే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా 10, 500 ల థియేటర్స్ లో రిలీజవుతుంది 2.0.

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమాలో రజినీకాంత్ సరసన ఎమీ జాక్సన్ హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ మోస్ట్ పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నాడు. A.R. రెహమాన్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజర్.