'మిస్టర్ మజ్ను' ఎంతవరకు వచ్చింది?

Wednesday,November 28,2018 - 01:04 by Z_CLU

అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న సినిమా మిస్టర్ మజ్ను. కొన్నాళ్లుగా ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి షూటింగ్ అప్ డేట్స్ లేవు. దీంతో స్వయంగా అఖిల్ రంగంలోకి దిగాడు. మిస్టర్ మజ్నుపై తనే స్వయంగా అప్ డేట్స్ అందించాడు.

https://twitter.com/AkhilAkkineni8/status/1067599575286919174

ఇలా ఓ సెట్ సాంగ్ మినహా, డిసెంబర్ 3 నాటికి టోటల్ సినిమా కంప్లీట్ అయిపోతుందని ప్రకటించాడు అఖిల్. బ్యాలెన్స్ సాంగ్ ను కూడా వీలైనంత తొందరగా పూర్తిచేసి, జనవరిలో థియేటర్లలోకి రాబోతున్నామని క్లారిటీ ఇచ్చాడు.

వెంకీ అట్లూరి దర్శకత్వంలో కంప్లీట్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అఖిల్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.