రజినీకాంత్ 2.0 లో స్పెషల్ గా నిలవనున్న బర్డ్

Wednesday,November 28,2018 - 11:06 by Z_CLU

విజువల్ వండర్ గా తెరకెక్కింది 2.0. రేపు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లోకి రానున్న ఈ సినిమా ఆడియెన్స్ కి నెవర్ సీన్ బిఫోర్ ఎక్స్ పీరియన్స్ ని కలిగించనుంది. మరీ ముఖ్యంగా హాలీవుడ్ టెక్నీషియన్స్ చేత కంపోజ్ అయిన 2150 VFX షాట్స్, సినిమాలో వన్ ఆఫ్ ది హైలెటెడ్ గా నిలవనున్నాయి. మరీ ముఖ్యంగా ట్రైలర్ లో మచ్చ్సుకు కనిపిస్తున్న బర్డ్ కోసం చాలా రోజులు కష్టపడింది 2.0 టీమ్.

ఈ బర్డ్ ని డిజైన్ చేసే ప్రాసెస్ లో చాలా కష్టపడిందట VFX టీమ్. ఫస్ట్ అటెంప్ట్ లో ఎప్పుడైతే శంకర్ కి ఆ విజువల్స్ నచ్చలేదో, ఇమ్మీడియట్ గా టీమ్ ని మార్చేశారట మేకర్స్. కంప్లీట్ గా సెల్ ఫోన్స్ తో నిండి ఉన్న ఒక బర్డ్ కి, ఆకారం ఇవ్వడానికి, జస్ట్ ఈ ఒక్క క్యారెక్టర్ కోసం చాలా రోజులుగా శ్రమ పడాల్సి వచ్చిందట టీమ్. బర్డ్ లుక్స్ ఫైనలైజ్ అయ్యాక దాని మూమెంట్స్ ని డిజైన్ చేయడంకోసం స్పెషల్ గా ఒక టీమ్ పని చేసిందట.

ఈ బర్డ్ కాంబినేషన్ లో ఉండే  సీన్స్, సినిమాని నెక్స్ట్ లెవెల్ లో నిలబెడతాయి అంటున్నారు మేకర్స్. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కింది 2.0.  ఎమీ జాక్సన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. A.R. రెహమాన్ మ్యూజిక్ కంపోజర్.