గ్రాండ్ గా రిలీజైన రజినీకాంత్ 2.0

Thursday,November 29,2018 - 10:02 by Z_CLU

ప్రపంచ వ్యాప్తంగా 10,000 కు పైగా థియేటర్స్ లో రిలీజయింది 2.0. రిలీజ్  అనౌన్స్ అయినప్పటి నుండే ఈ సినిమాపై క్రియేట్ అయిన క్రేజ్, ఓవరాల్ గా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్, రిలీజైన ప్రతి సెంటర్ లో వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది.

శంకర్ గ్రాండియర్ విజన్ కి సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఫ్యాన్స్ లో ఉన్న క్రేజ్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేసింది. దానికి తోడు ఫిల్మ్ మేకర్స్ అగ్రెసివ్ గా చేసిన ప్రమోషన్స్, ఆడియెన్స్ లో నెక్స్ట్ లెవెల్ క్యూరియాసిటీని జెనెరేట్ చేసింది. క్లాస్, మాస్ అని తేడా లేకుండా ప్రస్తుతం అందరి దృష్టి 2.0 పైనే ఉంది.

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో తెరకెక్కింది 2.0. ఎమీ జాక్సన్ హీరోయిన్. A.R. రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ డిఫెరెంట్ షేడ్స్ ఉన్న పవర్ ఫుల్ విలన్ రోల్ లో మెస్మరైజ్ చేస్తున్నాడు.