రజినీకాంత్ 2.0 లో ఎమీ జాక్సన్ రోల్

Wednesday,November 28,2018 - 05:47 by Z_CLU

ఎక్కడ చూసినా 2.0 మానియా కనిపిస్తుంది. మరికొన్ని గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజవుతుంది ఈ సినిమా. అయితే ఈ సినిమాలో రజినీకాంత్ సరసన నటించిన ఎమీ జాక్సన్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది. ‘రోబో’ లో ఐశ్వర్యా రాయ్ ప్లే చేసిన క్యారెక్టర్ కి, ఈ క్యారెక్టర్ కి అసలు డిఫెరెన్స్ ఏంటి..? ఈ క్వశ్చన్స్ కి క్లారిటీ ఇచ్చింది ఎమీ జాక్సన్.

2.0 లో హ్యుమనాయిడ్ లా కనిపించనుంది ఎమీ జాక్సన్. పేరు నీల. ఇప్పటికే రిలీజయిన ‘యంతర లోకపు’ సాంగ్ ని బట్టి, చిట్టికి, నీలకి మధ్య ఇంట్రెస్టింగ్ లవ్ ట్రాక్ కూడా ఉండబోతుందనిపిస్తుంది. ఇకపోతే సినిమాలో ‘చిట్టి’ ఫేస్ చేసే చాలెంజెస్ లో హెల్ప్ ఫుల్ గా ఉండబోతుందట నీల.

సినిమాలో ఎమీ జాక్సన్ కాంబినేషన్ లో భారీ స్టంట్స్ ఉండబోతున్నాయి. వీటన్నింటిని మైండ్ లో పెట్టుకుని ఎమీ జాక్సన్  కాస్ట్యూమ్స్  ని,  అటు రోబో లుక్స్ ఎలివేట్ అవుతూనే, ఈ స్టంట్స్ కోసం చేసే రోప్ వర్క్ లో కంఫర్ట్ ఉండేలా, థిక్ మెటీరియల్ తో డిజైన్ చేసిందట టీమ్. ఈ లెక్కన చూస్తే 2.0 లో ఎమీ జాక్సన్ స్పేస్ కూడా మరింత మెస్మరైజ్ చేయడం గ్యారంటీ అనే అనిపిస్తుంది.

రజినీకాంత్ తరవాత అక్షయ్ కుమార్ ఈ సినిమాకి డెఫ్ఫినెట్ గా మరో ప్రధాన ఆకర్షణ. ఇప్పటికే ఈ క్యారెక్టర్ కి సంబంధించిన స్టిల్స్ సోషల్ మీడియాలో వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తున్నాయి. శంకర్ ఈ సినిమాకి డైరెక్టర్. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుంది.