మైండ్ బ్లోయింగ్ - 2.0 లో ఇమోషనల్ ఫ్లాష్ బ్యాక్

Thursday,November 29,2018 - 12:58 by Z_CLU

సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది రజినీకాంత్ 2.0. ఫ్యాన్స్ కి ఇది ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన మూమెంట్. అంచనాలకు మించి  తెరకెక్కించాడు దర్శకుడు సినిమాని. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా, పాజిటివ్ బజ్. ఓవరాల్ గా మ్యాజిక్ స్ప్రెడ్ చేస్తుంది 2.0. అయితే ఈ సినిమాలోని ఇమోషనల్ ఫ్లాష్ బ్యాక్ కి మరింతగా   ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.

2.0 లో విజువల్ ఎఫెక్ట్స్ కి ధీటుగా ఇమోషనల్ స్టోరీ ఉండబోతుందన్న విషయం కొత్తది కాదు. ప్రమోషన్స్ లో ఫిల్మ్ మేకర్స్ ఇది మరీ మరీ చెప్పిన విషయమే. కానీ శంకర్ ఆ సీక్వెన్సెస్ తో ఈ రేంజ్ లో మ్యాజిక్ జెనెరేట్ చేస్తాడని ఏ మాత్రం ఎక్స్ పెక్ట్ చేయలేదు. సోషల్ మీడియాలో 2.0 ప్రస్తావన వచ్చిన ప్రతిచోట ఒక్కమాటలో ‘మైండ్ బ్లోయింగ్’ అంటున్నారు ఫ్యాన్స్.

ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో ఈ రోజు నుండి ఎంటర్ టైన్ చేస్తుంది. భారీ స్థాయిలో 10,500 ల థియేటర్స్ లో రిలీజైన ఈ సినిమాకి క్రియేట్ అయిన డిమాండ్ ని బట్టి, మరిన్ని థియేటర్స్  ని పెంచే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో తెరకెక్కింది 2.0.