2.0 అకౌంట్ లో చేరనున్న మరో భారీ రికార్డ్

Wednesday,December 05,2018 - 10:02 by Z_CLU

రిలీజైన ఫస్ట్ రోజే బ్లాక్ బస్టర్ ట్యాగ్ సొంతం చేసుకున్న 2.0., ప్రపంచ వ్యాప్తంగా 10,500 థియేటర్స్ లో రిలీజైంది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే  ఇదొక రికార్డ్. అయితే ఓ వైపు ఇప్పటికే రికార్డ్స్ బ్రేక్ చేసే పనిలో ఉన్న 2.0 ని, అంతే భారీగా చైనాలో రిలీజ్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు మేకర్స్. చైనాలో ఏకంగా 10,000 థియేటర్స్ లో రిలీజ్ కానుంది 2.0.

ఈ సినిమాని చైనా లో రిలీజ్ చేయడానికి HY మీడియాతో అసోసియేట్ అయింది లైకా ప్రొడక్షన్స్. మే 2019 లో ఏకంగా 10,000 ల థియేటర్స్ లో అంటే 56,000 ల స్క్రీన్స్ లో  ఈ సినిమాని  రిలీజ్ చేయనున్నారు. వాటిలో 47000 3D స్క్రీన్స్  కావడం విశేషం. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

చైనా రిలీజ్ కి సంబంధించిన ఫార్మాలిటీస్ తో పాటు, 2.0 చైనా వర్షన్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను ఆల్రెడీ బిగిన్ చేసేసింది 2.0 టీమ్. చైనాలో ఇండియన్ సినిమాలకు భారీ స్థాయిలో క్రేజ్ ఉంది. దానికి తగ్గట్టుగానే ప్లాన్డ్ గా అగ్రెసివ్ గా సినిమాను ప్రమోట్ చేసే ప్రిపరేషన్స్ లో  ఉన్నారు మేకర్స్.

శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కింది 2.0. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ సినిమాలో ఎమీ జాక్సన్ హీరోయిన్ గా నటించింది. A.R. రెహమాన్ మ్యూజిక్ కంపోజర్.