రాజశేఖర్ సరసన ముగ్గురు భామలు

Wednesday,October 31,2018 - 11:45 by Z_CLU

ఫ్యామిలీ హీరోగా కొనసాగిన రోజుల్లో రాజశేఖర్ సినిమాల్లో ఇద్దరేసి హీరోయిన్లు ఉండేవారు. ఆ రోజుల్లో ఈ యాంగ్రీ యంగ్ మేన్ కు ఫిమేల్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉండేది. మళ్లీ ఇన్నాళ్లకు తన సినిమాలో ముగ్గురు హీరోయిన్లకు స్థానం కల్పించాడు రాజశేఖర్.

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ చేస్తున్న సినిమా కల్కి. ఈ సినిమాలో నందిత శ్వేతను హీరోయిన్ గా సెలక్ట్ చేశారు. తాజాగా మరో ఇద్దరు ముద్దుగుమ్మలకు కూడా చోటు కల్పించారు. వాళ్లే ఆదా శర్మ, స్కార్లెట్ విల్సన్. ఈ ముగ్గురు భామలకు సినిమాలో మంచి పాత్రలు ఆఫర్ చేశారు.

1980 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది కల్కి సినిమా. ఈ సినిమా కోసం హైదరాబాద్ శివార్లలో 2 కోట్ల రూపాయల భారీ సెట్ వేశారు. ఆ సెట్ లోనే ప్రస్తుతం షూటింగ్ నడుస్తోంది. శివానీ శివాత్మిక మూవీస్ బ్యాన‌ర్ స‌మ‌ర్ప‌ణ‌లో హ్య‌పీ మూవీస్ ప‌తాకంపై రూపొంద‌నున్న ఈ చిత్రానికి సి.క‌ల్యాణ్‌, శివానీ రాజ‌శేఖ‌ర్‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్ నిర్మాత‌లు.