కల్కి రిలీజ్ డేట్ ఫిక్స్

Monday,June 10,2019 - 11:54 by Z_CLU

టీజర్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది కల్కి సినిమా. రీసెంట్ గా వచ్చిన మరో టీజర్ కూడా సూపర్ హిట్ అయింది. దీంతో సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. ఇలా హైఎక్స్ పెక్టేషన్స్ మధ్య కల్కి రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఈనెల 28న కల్కి సినిమా వరల్డ్ వైడ్ థియేటర్లలోకి రానుంది.

గరుడవేగ సినిమా తర్వాత రాజశేఖర్ నుంచి వస్తున్న మూవీ ఇదే. అటు “అ!” లాంటి ప్రయోగాత్మక చిత్రం తర్వాత దర్శకుడు ప్రశాంత్ వర్మ తీసిన సినిమా కూడా ఇదే. అందుకే కల్కిపై అంచనాలు భారీగా ఉన్నాయి.

నటీనటులు: రాజశేఖర్, అదా శర్మ, నందితా శ్వేత, పూజితా పొన్నాడ, స్కార్లెట్ విల్సన్, రాహుల్ రామకృష్ణ, నాజర్, అశుతోష్ రాణా, శత్రు
టెక్నీషియన్స్:
ఛాయాగ్రహణం: దాశరథి శివేంద్ర
సంగీతం: శ్రవణ్ భరద్వాజ్
ఆర్ట్: నాగేంద్ర
ఎడిటర్: గౌతమ్ నెరుసు
నిర్మాత: సి.కళ్యాణ్
దర్శకత్వం: ప్రశాంత్ వర్మ