2.0 ట్రైలర్ లో హైలెట్ కానున్న ఎలిమెంట్స్

Wednesday,October 31,2018 - 12:01 by Z_CLU

2.0 ట్రైలర్ మరో 3 రోజుల్లో రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ తో విజువల్ ట్రీట్ లా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 29 న గ్రాండ్ గా రిలీజవుతుంది. ఈ లోపు అగ్రెసివ్ మోడ్ లో సినిమాను ప్రమోట్ చేస్తున్న ఫిల్మ్ మేకర్స్, నవంబర్ 3 న ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నారు. దాంతో ఫ్యాన్స్ కాన్సంట్రేషన్ మొత్తం ఈ డేట్ పై ఫిక్సయి ఉంది.

గతంలో రిలీజైన ఈ సినిమా టీజర్ లో మ్యాగ్జిమం సినిమా థీమ్ ని ఎలివేట్ చేసింది సినిమా యూనిట్. అందుకే ఈ సారి రిలీజవుతున్న ఈ ట్రైలర్ లో మరిన్ని ఎగ్జైటింగ్ ఎలిమెంట్ ని రివీల్ చేయడం గ్యారంటీ అని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఆ ఎక్స్ పెక్టేషన్స్ కి తగ్గట్టే, ఫిల్మ్ మేకర్స్ అదే స్థాయిలో సరికొత్త పోస్టర్స్ రిలీజ్ చేస్తుండటంతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ ఎలిమెంట్ లా మారింది 2.0.

శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది. ఎమీ జాక్సన్ హీరోయిన్. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు. A.R. మ్యూజిక్ కంపోజర్.