హిస్టారికల్ పేర్లు... కథ వేరు

Tuesday,June 11,2019 - 01:03 by Z_CLU

గోపీచంద్ కొత్త సినిమా పేరు ‘చాణక్య’. సినిమా ఇప్పుడే తెరకెక్కుతుంది కానీ టైటిల్ ఆడియెన్స్ కి పరిచయమే. అర్థశాస్త్రాన్ని రాసిన చాణక్యుడిని గుర్తుచేస్తుందీ సినిమా. మరి సినిమాకి… చాణక్యుడికి ఏమైనా సంబంధముంటుందా…? అంటే అస్సలుండదు. మహా అయితే సినిమాలో హీరో గోపీచంద్ క్యారెక్టరైజేషన్ చాణక్యుడిని గుర్తు చేసేలా ఉండే చాన్సెస్ ఉన్నాయి. అంతెందుకు ఓ రకంగా టాలీవుడ్ లో ఇలాంటి హిస్టారికల్ టైటిల్స్ ట్రెండ్ నడుస్తుందనిపిస్తుంది. ఇలాంటి టైటిల్స్ తో ఇంకా చాలా సినిమాలు రాబోతున్నాయి.

వాల్మీకి –   వరుణ్ తేజ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఇది. రామాయణాన్ని రాసిన వాల్మీకికి ఈ సినిమాకి సంబంధముందా..? అస్సలుండదు. ఆ ‘వాల్మీకి’ రామాయణాన్ని రాస్తే, ఈ వాల్మీకి ఓ గ్యాంగ్ స్టర్ కి సంబంధించిన రియల్ లైఫ్ ని రాస్తాడు. సినిమాలో గ్యాంగ్ స్టర్ గా వరుణ్ తేజ్ నటిస్తున్నాడు.

అశ్వత్థామ: మహాభారతంలో ద్రోణాచార్యుడి కొడుకు. ఇప్పుడు ఇది నాగశౌర్య సినిమా టైటిల్. ఈ కథను కూడా తనే సొంతంగా రాసుకున్నాడు. ఈ సినిమాతో రమణ తేజ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఏరికోరి ఈ టైటిల్ ని ఫిక్స్ చేసుకున్న నాగశౌర్య అంత పవర్ ఫుల్ గా ఏం రాసుకున్నాడో చూడాలి. ఇంతకుముందు నాగశౌర్య చేసిన నర్తనశాల కూడా హిస్టారికల్ టైటిలే.

కల్కి : మహా విష్ణువు పదవ అవతారం కల్కి. రాజశేఖర్ కొత్త సినిమా టైటిల్ కూడా అదే. అంతమాత్రాన ఇది డివోషనల్ ఎంటర్ టైనర్ కాదు. పక్కా క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. చూడాలి మరీ.. ఈ టైటిల్ కి , సినిమాలో హీరో క్యారెక్టర్ కి ఎలాంటి సిమిలారిటీస్ ఉంటాయో…

విశ్వామిత్ర : ‘విశ్వామిత్ర’ మహర్షికి నందిత శ్వేత హీరోయిన్ గా తెరకెక్కిన ‘విశ్వామిత్ర’ సినిమాకి అస్సలు సంబంధం లేదు. హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకి మేకర్స్, ఈ టైటిల్ నే ఎందుకు ఫిక్సయ్యారో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. బట్, సినిమాకు టైటిల్ కు చాలా లింక్ ఉందనేది మాత్రం వాస్తవం.